ఫోటో స్టోరీ : బిజిలీ జిలేబీ

Update: 2018-10-30 16:31 GMT
కాలికి మువ్వ‌లు పెట్టి... మిడ్డీ డ్రెస్సు తొడిగి.. బులుగు చున్నీతో టాప్ లెస్‌ ర‌హ‌స్యాన్ని క‌ప్పి పుచ్చుతోంది ఈ  బిజిలీ. ఇంత‌కీ ఎవ‌రీ జిలేబీ..?

నోట్లో చుట్ట పెట్టింది.. ఆత్రంగా ఎవ‌రికోస‌మో వేచి చూస్తోంది.. విర‌హంతో వీగిపోతోంది.. ఇంత‌కీ ఎవ‌రీ మందాకిని?

కొండ మ‌ల్లి.. బొండుమ‌ల్లి.. స‌న్న‌జాజి.. ఎంక‌మ్మ‌.. సుబ్బ‌మ్మ‌.. బుచ్చ‌మ్మ‌.. వీర‌మ్మ‌.. ఇంత‌కీ ఎవ‌రో ఎవ‌రో.. ఎవ‌రో ఏంటో?  ఇప్పుడే తెల‌వాల్న‌!! ఈవిడెవ‌రో వెంట‌నే తెలియాల్న!

అంత తేలిగ్గా క‌నిపెట్ట‌లేని వ‌య్యార‌మేమీ కానేకాదు. అంద‌రికీ సుప‌రిచిత‌మైన శృంగేరి భామ .. వివాదాల బాలీవుడ్ ఐటెమ్ గాళ్ పూన‌మ్ పాండే. అప్పుడ‌ప్పుడు నిత్య‌నూత‌న‌మైన ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంపై విరుచుకుప‌డే ఈ అమ్మ‌డు ఇప్పుడిలా కాస్త కొత్త‌గానే ద‌ర్శ‌న‌మిచ్చింది. అల్ట్రా మోడ్ర‌న్ బిజిలీ లుక్‌ లో క‌నిపించి మ‌త్తెక్కించింది.

ప్ర‌స్తుతం పూన‌మ్ సినిమాల‌తో కంటే మోడ‌లింగ్ అసైన్‌ మెంట్స్‌తోనే బిజీగా క‌నిపిస్తోంది. 2013లో న‌షా చిత్రంతో నిషా ఎక్కించిన ఈ కొంటెక‌ కోనంగి అటుపై ఈ ఐదేళ్ల‌లో పెద్ద‌గా పొడిచేసిందేం లేదు. కేవ‌లం ఐదే ఐదు చిత్రాల్లో న‌టించింది. అవి కూడా డీగ్రేడ్ శృంగార క‌థ‌ల‌తో తెర‌కెక్కించిన చిత్రాలే కాబ‌ట్టి ఆ త‌ర‌హా బ్రండ్ ఈ అమ్మ‌డిపై ప‌డిపోయింది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఇలా కొత్త‌గా ఫోటోషూట్ల‌తో ఈ అమ్మ‌డికి ఒరిగేదేంటి? అంటే.. సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్‌ లో ఉండేందుకే. ఇటు తెలుగు - అటు త‌మిళ్‌ లోనూ పూన‌మ్ అవ‌కాశాల కోసం పాకులాడుతోంది. ఇదివ‌ర‌కూ తెలుగులో `మాలిని అండ్ కో` అనే చిత్రంలో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. ల‌క్ష‌ల్లో పారితోషికం ఖాతాలో వేసుకుంది. అదీ సంగ‌తి.


Tags:    

Similar News