పూజా మరో రొమాంటిక్‌ ఫోజ్‌ తో రాబోతుందట

Update: 2020-07-26 10:10 GMT
లక్కీ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ తో ‘రాధేశ్యామ్‌’ మరియు అఖిల్‌ అక్కినేనితో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయాయి. ఈ రెండు సినిమాలపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. రెండు సినిమాల్లో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడంతో పాటు సినిమాలో చాలా కీలకమైన పాత్రలను పూజా చేసిందట. ఇటీవలే రాధేశ్యామ్‌ చిత్రం పోస్టర్‌ తో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాధేశ్యామ్‌ ఫస్ట్‌ లుక్‌ లో ప్రభాస్‌ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్‌ ఫోజ్‌ ను చూపించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లోనే పూజా హెగ్డేను చూపించారంటే సినిమాలో ఆమెది ఎంత కీలకమైన పాత్రనో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ పోస్టర్‌ తో రాబోతుంది. ఇప్పటికే అఖిల్‌ మరియు పూజాల విడి విడి పోస్టర్స్‌ వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రొమాంటిక్‌ పోస్టర్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయబోతున్నారు.

ఈనెల 29న మద్యాహ్నం 1.30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది. ఈ రొమాంటిక్‌ పోస్టర్‌ తో సినిమాపై అంచనాలు పెంచేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్‌ సమర్పించబోతున్నారు.

అఖిల్‌ మొదటి మూడు సినిమాలు నిరాశ పర్చడంతో ఈ చిత్రంపై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కరోనా కల్లోల కాస్త అయినా తగ్గితే సినిమాను పున: ప్రారంభించి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News