పారితోషికం పెంచేసిన పూజా హెగ్డే?
టాలీవుడ్లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఏ మాత్రం ఆలస్యం చేసినా, ఆ అవకాశం పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోతుందేమోనని కంగారు పడుతున్నారు. పారితోషికం కాస్త తక్కువైనా ఫరవాలేదనేస్తున్నారు .. లేదంటే ఆ పాత్రకి గాను పూజా హెగ్డే పేరు వినిపిస్తుందేమోనని ఆదుర్దా పడుతున్నారు. ఒకవైపున ఈ సుందరి డేట్స్ కోసం పోటీపడే నిర్మాతల సంఖ్య పెరిగిపోతూ ఉంటే, మరోవైపున ఆమె విషయంలో టెన్షన్ పడే హీరోయిన్స్ సంఖ్య కూడా పెరిగిపోతోంది.
పూజా హెగ్డే అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకు తగినట్టుగానే ఆమెకి స్టార్ హీరోల ప్రాజెక్టులలో అవకాశాలు వస్తున్నాయి .. అదృష్టం కొద్దీ హిట్ల మీద హిట్లు పడుతున్నాయి. దాంతో పూజా హెగ్డే అలా స్క్రీన్ పై కనిపిస్తే చాలు .. సినిమా హిట్ అనే సెంటిమెంట్ బయల్దేరింది. ఇటు యువ హీరోలు .. అటు సీనియర్ స్టార్ హీరోలు ఈ బ్యూటీనే కావాలని పట్టుపడుతూ ఉండటానికి ప్రధానమైన కారణం ఈ సెంటిమెంటే!. తెలుగులో నాలుగు భారీ విజయాలను వరుసగా అందుకున్న ఈ భామ, ఇప్పుడు తమిళ .. హిందీ భాషల్లోని అవకాశాలను ఆక్రమించడంలో బిజీగా ఉంది.
తెలుగులో వరుస హిట్లు .. కోలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలు .. బాలీవుడ్ నుంచి పిలుపులు .. వీటన్నిటితో పూజా హెగ్డే సతమతమైపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి .. క్రేజ్ ఉండగానే సినిమాలను చుట్టబెట్టాలనే విషయం ఈ నాజూకు భామకు ఎవరూ చెప్పవలసిన పనిలేదు. దారం లేకుండానే దండ కట్టగలిగే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అమాంతంగా పారితోషికం పెంచేసిందని అంటున్నారు. 'అల వైకుంఠపురములో' వరకూ ఒకటిన్నర నుంచి 2 కోట్లకి మధ్య తీసుకుంటూ వచ్చిన పూజా హెగ్డే, ఆ తరువాత నుంచి 2 కోట్లకి పైగా డిమాండ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. 'రాధేశ్యామ్' హిట్ అయితే ఆమె పారితోషికం 3 కోట్లకి వెళ్లినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.