అభిమానించే హీరోతో అవకాశం ఆనందంగా ఉంది

Update: 2020-11-26 10:50 GMT
టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే బాలీవుడ్‌ లో కూడా రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు ముకుంద మరియు ఒక లైలా కోసం సినిమా తర్వాత బాలీవుడ్‌ కు మెహెంజదారో సినిమా కోసం వెళ్లింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. డీజేతో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌ లో సక్సెస్‌ కాలేక పోయిన ఈ అమ్మడికి ఆ సినిమాలపై మోజు మాత్రం తగ్గలేదు. అవకాశం వస్తే వదులుకోకుండా అక్కడ నటిస్తూనే ఉంది.

తెలుగుతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా సమాంతరంగా నటిస్తూ బాలీవుడ్‌ లో స్టార్‌ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న పూజా హెగ్డేకు అనూహ్యంగా సల్మాన్‌ ఖాన్‌ మూవీ సర్కస్‌ లో నటించే అవకాశం దక్కింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ సినిమా సక్సెస్‌ అయితే పూజా హెగ్డే బాలీవుడ్ లో సెటిల్‌ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.

అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో.. నేను అభిమానించే హీరోలతో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందని నమ్మాను. నా శ్రమకు ఫలితం దక్కింది అంటూ పేర్కొంది. సల్మాన్‌ ఖాన్‌ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఈ అమ్మడు అతడి సరసన నటించే అవకాశం రావడంతో ఆనందానికి అవధులు లేకుండా ఉంది. బాలీవుడ్‌ లో బిజీ అయితే టాలీవుడ్‌ ను ఈ అమ్మడు వదిలేస్తుందేమో అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News