రామ్ చ‌ర‌ణ్ తో చిందేస్తున్న పూజా హెగ్డే..!

Update: 2021-01-22 14:30 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుత‌న్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల నిడివి గల 'సిద్ధ' పాత్రలో చెర్రీ ప‌వ‌ర్ ఫుల్ గా కనిపించనున్నాడట. ఈ షూట్ కోసం ఈ మధ్యనే ఆచార్య సెట్స్ లో అడుగు పెట్టాడు రామ్ చరణ్.

భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల్లోనూ అంత‌కంత‌కూ క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రం టీజర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

కాగా.. ఈ మూవీలో చిరంజీవి స‌ర‌స‌న కాజల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ.. చెర్రీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంలో నిన్నామొన్న‌టి వ‌ర‌కు స‌స్పెన్స్ నెల‌కొంది. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని తేలింది. మొద‌ట‌ రష్మిక మంద‌న్న‌ను అనుకున్న‌ప్ప‌టికీ.. డేట్స్ అడ్జెస్ట్ కాలేద‌ని టాక్‌.

దీంతో.. పూజా హెగ్డేను సంప్రదించగా.. వెంటనే ఓకే చెప్పేసి, ఈ ప్రాజెక్టుపై సంతకం కూడా చేసిందట‌. నెక్స్ట్ షెడ్యూల్లో సెట్స్‌లో అడుగు పెట్ట‌నుంద‌ట పూజా. అయితే.. చెర్రీ పాత్ర ప‌రిమితంగా ఉన్న‌ప్ప‌టికీ.. పూజాతో క‌లిసి ప్రత్యేక యుగళ గీతంలో న‌ర్తించ‌నున్నాడ‌ట‌. చిరు-చెర్రీ మధ్య స‌న్నివేశాల‌ను త్వరలో చిత్రీకరించనున్నారు.

చరణ్-పూజా హెగ్డే షూట్‌ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుంద‌ని స‌మాచారం. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తిచేసి స‌మ్మ‌ర్ బ‌రిలో నిల‌పాల‌ని చూస్తోంది యూనిట్‌. అందుతున్న స‌మాచారం మేర‌కు మే 7 వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News