• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను ఇండియన్‌ హీరోయిన్‌...

నేను ఇండియన్‌ హీరోయిన్‌ లా ఉండాలనుకుంటున్నా

By - Tupaki Desk
Update: 2021-08-06 12:30 GMT
హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కించుకుని మెల్లగా ఇతర భాషల్లో కూడా ప్రస్తుతం బిజీ అవుతోంది. తెలుగు లోనే ఈమెకు మొదట కమర్షియల్‌ సక్సెస్ దక్కింది. అంతకు ముందు ఈమె హిందీలో నటించినా ఇతర భాషల్లో నటించినా కూడా సక్సెస్ లు దక్కింది లేదు. తెలుగు లో డీజే తో ఈమె కెరీర్‌ టర్న్‌ అయ్యింది. అప్పటి నుండి వరుసగా తెలుగు లో భారీ చిత్రాల్లో.. సూపర్ స్టార్‌ లకు జోడీగా నటిస్తూ దూసుకు పోతుంది. తెలుగు వచ్చిన స్టార్‌ డమ్‌ తో ఈమె ఇతర భాషల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెళ్లడించింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వారి సొంత చేసుకున్నారు. తెలుగు లో నాకు వచ్చిన అవకాశాల పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. తెలుగులోనే కాకుండా నేను ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఒక భాష హీరోయిన్ గా కాకుండా ఇండియన్ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి భాష ప్రేక్షకులు నన్ను చూడాలి.. నా సినిమాలను ఆధరించాలి అనేది నా కోరిక అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా చేస్తూ ఇండియన్‌ హీరోయిన్ పూజా హెగ్డే అనిపించుకోవాలనేది నా కోరిక అన్నట్లుగా పేర్కొంది.

ఒక్క భాషకు పరిమితం అవ్వకూడదు అని ప్రతి ఒక్క హీరోయిన్ కూడా అనుకుంటారు. పూజా హెగ్డే కూడా అన్ని భాషల్లో నటించాలని అనుకోవడం సహజమైన విషయం. హీరోయిన్‌ గా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో నటిస్తోంది. ఈమె సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ప్రభాస్ తో ఈమె నటించిన రాధే శ్యామ్‌ తో పాన్ ఇండియా స్టార్ గా పూజా కు గుర్తింపు రావడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా విజయ్‌ తో చేస్తున్న తమిళ సినిమా.. హిందీలో సల్మాన్ చేయబోతున్న హిందీ సినిమా కూడా పూజా హెగ్డే ఆమె కోరికను తీర్చుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా ఇండియన్‌ హీరోయిన్స్ గా కొందరికి మాత్రమే గుర్తింపు దక్కుతుంది. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇండియన్‌ హీరోయిన్ గా రాబోయే రోజుల్లో గుర్తింపు దక్కించుకుంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

పూజా హెగ్డే తెలుగు లో చేసిన రాధే శ్యామ్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఆచార్య లో కూడా కీలక పాత్రలో ఈమె కనిపించింది. ఆ సినిమా కూడా త్వరలో విడుదల అవ్వబోతుంది. ఇంకా పలు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి పూజా హెగ్డే సౌత్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా బిజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది.




Tags:    
  • Actress 
  • Pooja Hegde 
  • Bollywood movies 
  • Tollywood Movies 

Similar News

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

Copyright @2026

Powered by Blink CMS