• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ''పొగ‌రు'' ఫ‌స్ట్ సాంగ్...

''పొగ‌రు'' ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్...!

By - Tupaki Desk
Update: 2020-08-06 09:50 GMT
'యాక్ష‌న్ కింగ్' అర్జున్ మేన‌ల్లుడు ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ''పొగ‌రు''. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా నటిస్తోంది. 'విక్టరీ' 'అధ్యక్షా' 'ర‌న్న' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నంద‌కిశోర్ ''పొగ‌రు'' చిత్రానికి ద‌ర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్‌ బ్యానర్ పై బి.కె. గంగాధ‌ర్ నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కానుంది. 'పొగరు' తెలుగు వెర్షన్ ప్రమోష‌న్స్‌ లో భాగంగా లేటెస్టుగా ఈ సినిమాలోని 'క‌రాబు' అనే సాంగ్ రిలీజ్ చేసారు. 

ఇప్పటికే టిక్ టాక్ వీడియోలలో ఫేమస్ అయిన ఈ పాట తెలుగు వర్షన్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మాస్ సాంగ్ కి పాపుల‌ర్ క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ చంద‌న్ శెట్టి బాణీలు అందించారు. ధృవ స‌ర్జా మాస్ లుక్ లో కనిపిస్తుండగా.. రష్మిక క్యూట్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తోంది. హీరో హీరోయిన్ ని ఆటపట్టించే ఇతివృత్తంలో ఆ పాట తెరకెక్కబడింది. 'క‌రాబు' సాంగ్ లో యాక్ష‌న్ ప్రిన్స్‌ ధృవ స‌ర్జా డ్యాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ఎస్‌.డి. విజ‌య్ మిల్టన్‌ మరియు ఎడిట‌ర్‌ గా కె.ఎం. ప్రకాష్ వర్క్ చేస్తున్నారు. ఇక సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ తో పాటు 'డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ' స్టార్లు కై గ్రీన్‌ - మోర్గాన్ ఆస్టే - జో లిండ్నర్‌ - జాన్ లూకాస్ కూడా నటిస్తున్నారు.

Full View

Tags:    
  • Pogaru 
  • Pogaru Movie 
  • Pogaru Songs 
  • Pogaru Movie Updates 
  • Pogaru Latest Updates 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS