• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాబ్.. వేణు శ్రీరామ్ మ‌రో...

సాబ్.. వేణు శ్రీరామ్ మ‌రో డాలీ అవ్వ‌డు క‌దా..!

By - Tupaki Desk
Update: 2021-04-28 16:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు వర్క్ చేసిన వారు కొంతకాలం ఆయన కాంపౌండ్ లోనే ఉండిపోతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దర్శకనిర్మాతలు - నటీనటులు - ఇతర టెక్నిషియన్స్ పవన్ సినిమాలకు రిపీట్ అవుతూ ఉంటారు. పవన్ చేసిన సినిమాల లిస్ట్ చూసుకుంటే ఈ విషయం అర్థం అవుతుంది. ఎవ‌రనైనా పవన్ ను ఇష్టప‌డ‌టం మొద‌లుపెడితే వారు ఇంక ఆయనతోనే ఉండిపోవాలి అంటుంటారు. సాన్నిహిత్యం వరకు ఇది బాగానే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ ని బట్టి అవకాశాలు ఇస్తుంటారు, కాబట్టి పవన్ తో కొన్నాళ్ళు కలిసున్న తర్వాత ఆ ప్లేస్ లోకి వేరే వాళ్లు వ‌స్తుంటారు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ మనసు దోచుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్.

'వకీల్ సాబ్' సినిమాతో పవన్ కళ్యాణ్ కు మంచి కంబ్యాక్ ఇచ్చాడు శ్రీరామ్ వేణు. 'పింక్' కథను తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్లు ఆయన స్క్రిప్ట్ ని మలిచిన విధానం ఫ్యాన్స్ ని మెప్పించింది. స్వతహాగా పవర్ స్టార్ అభిమాని అయిన వేణు.. ఈ సినిమాతో ఆయన్ని ఇంప్రెస్ చేసాడు. దీంతో ఇప్పుడు పవన్ గురి వేణు మీద ప‌డింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేసినందుకు గర్వపడుతున్నానంటూ పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వేణు శ్రీరామ్ తో మరో సినిమా చేయడానికి పవన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. తన కోసం మ‌రో క‌థ రెడీ చేయాల్సిందిగా పవన్ స్వ‌యంగా వేణు తో చెప్పిన‌ట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ మీద ఆశ పెట్టుకుని గత మూడేళ్ళుగా ఆయన దగ్గరే ఉండిపోయిన డైరెక్టర్ డాలీ అలియాస్ కిషోర్ కుమార్ పార్థసాని పరిస్థితి వేణు కి కూడా వస్తుందేమో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వస్తున్నాయి. పవన్ తో 'గోపాలా గోపాల' 'కాటమరాయుడు' వంటి చిత్రాలను తెరకెక్కించిన డాలీ.. పవన్ తో మరో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో స్టోరీ రెడీ చేస్తున్నాడని సమాచారం. ఇప్ప‌టికే ఓ పది క‌థ‌లు వినిపించగా.. అవేవి పవన్ కు నచ్చ‌లేదట. అయినా సరే డాలీ ఛాన్సులు వస్తున్నా వదిలేసుకొని, ఇప్పటికీ పీకే కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడని టాక్. ఇప్పుడు పవన్ తో మరో సినిమా చేయాలని చూస్తున్న వేణు శ్రీరామ్ పరిస్థితి కూడా డాలీ మాదిరిగా తయారవుతుందేమో అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    
  • vakeel saab 
  • vakeel saab collections 
  • vakeel saab pawan kalyan 
  • dolly 
  • venusriram 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS