ఫోటో స్టోరి: పొట్టి నిక్క‌రులో షేక్ చేస్తున్న ప్ర‌భాస్ హీరోయిన్

Update: 2021-03-02 17:30 GMT
స్టైల్ ఐక‌న్ అన్న ప‌దానికి శ్ర‌ద్ధా నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఈ భామ మోడ్ర‌న్ ఔట్ ఫిట్స్ తో పాటు ట్రెడిష‌న‌ల్ లుక్ లోనూ అద‌ర‌గొడుతుంది. తాజాగా శ్ర‌ద్ధా ముంబై విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మైన తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఎయిర్ పోర్ట్ లో చిట్టి పొట్టి నిక్క‌రులో శ్ర‌ద్ధా అందాలు క‌నువిందు చేశాయి. డెనిమ్ చినుగుల నిక్క‌రు.. వైట్ టీష‌ర్ట్ తో శ్ర‌ద్ధా ఎంతో ట్రెండీగా క‌నిపించింది. ఆ టీష‌ర్ట్ పై క్యాప్ష‌న్ కూడా ఆక‌ర్షించింది. త‌న స‌న్న‌జాజి న‌డుము మీదుగా ఆ చేతికి బ‌రువైన హ్యాండ్ బ్యాగ్ ధ‌రించి .. పింక్ మాస్క్.. డార్క్ బ్రౌన్ గ్లాసెస్ తో లేడీ రెబ‌ల్ లా క‌నిపించింది. ముఖ్యంగా ఆ చినుగుల పొట్టి నిక్క‌రులో శ్ర‌ద్ధా థై సొగ‌సులు పోర్టులో జ‌నాల్ని క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదట‌. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

ఇంత‌కీ శ్ర‌ద్ధా ఎక్క‌డికి వెళుతోంది? అంటే.. మాల్దీవుల్లో త‌న ఆంటీ గారి తాలూకా పెళ్లికి వెళుతోంట‌. షాజా మొరానీ-ప్రియాంక్ శ‌ర్మ జంట పెళ్లి అని తెలిసింది. ఇక ఈ పెళ్లి వేదిక వ‌ద్ద త‌న ప్రియుడు రోహ‌న్ శ్రేష్ఠ‌తో క‌లిసి శ్ర‌ద్ధా ఫోటోల‌కు ఫోజులివ్వ‌నుంద‌ని కూడా బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. పెళ్లి వెన్యూకి వెళ్లాక మాత్రం శ్ర‌ద్ధా బ్లూ లెహంగాలో క‌నిపించ‌నుందిట‌.

ఇంత‌కుముందు డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్ అద‌ర‌గొట్టింది. అందులో ప్ర‌భాస్ లేడీ ల‌వ్ గానే కాదు.. లేడీ కాప్ పాత్ర‌లో యాక్ష‌న్ విన్యాసాల‌తో మెప్పించింది. ఆషిఖి 2 స‌హా ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో శ్ర‌ద్ధా నాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News