• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: భువికి...

ఫోటో స్టోరి: భువికి వేంచేసిన‌ గ్రీక్ గాడెస్ ఈ క‌పూర్ గాళ్

By - Tupaki Desk
Update: 2021-07-07 00:30 GMT
ఫ్యాష‌నిస్టా అన్న ప‌దానికి నిర్వ‌చ‌నం సోన‌మ్ క‌పూర్. క‌పూర్ ఫ్యామిలీలో ఎవ‌ర్ గ్రీన్ ఫ్యాష‌నిస్టాగా పాపుల‌రైన సోన‌మ్ కి ఫ్యాష‌న్ హెరిటేజ్ ప్యారిస్ లో సైతం అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. బిజినెస్ మేన్ అహూజాని పెళ్లాడి లండ‌న్ లో సెటిల‌య్యాక కూడా ఈ అమ్మ‌డి సెల‌బ్రేష‌న్ లైఫ్ ఏమాత్రం మార‌లేదు. నిరంత‌రం వ‌రుస ఫోటోషూట్ల‌తో.. దివినుంచి దిగి వ‌చ్చిన  ఫ్యాష‌న్ దేవ‌తలా వెలిగిపోతూనే ఉంది.

తాజాగా ప్ర‌ఖ్యాత వోగ్ క‌వ‌ర్ పేజీపై సోన‌మ్ ద‌ర్శ‌న‌మిచ్చింది. వోగ్ కోసం ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో సోన‌మ్ ఇచ్చిన ఫోజులు వైర‌ల్ గా మారాయి. ``నేను ఎవరో అర్థం చేసుకోవడానికి.. నేను చాలా సౌకర్యంగా ఉండటానికి.. ఇలా చేయ‌డానికి నాకు చాలా స‌మ‌యం పట్టింది. ఈ షూట్ కానీ ఇంటర్వ్యూ కానీ నా వ్యక్తిత్వంలో ఒక కోణాన్ని తెలిపేందుకే. నేను అంతగా ఫోటోషూట్ కోసం ఏదీ ప్రదర్శించలేదు. నాకు సహాయం చేసిన టీమ్ కు ధన్యవాదాలు. ప్రియాంకా... మరియానో వివాంకో చేత కవర్ షాట్ ఇది`` అని తెలిపారు.

మే 2018 లో ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న తరువాత లండన్ కు కాపురాన్ని మారిన సోనమ్ కపూర్ అక్కడ ఆమె అనుభవిస్తున్న స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఆమె అక్కడ తన జీవితం గురించి ఇంటి పని త‌న‌కు తానుగా ఎలా చేసుకుంటుందో కూడా వెల్ల‌డించింది. తాను ఇప్ప‌టికీ లండ‌న్ పర్యాటకురాలు అని సోనమ్ అన్నారు.

వోగ్ తో సోనమ్ మాట్లాడుతూ ``నాకు ఇక్కడ స్వేచ్ఛ ఇష్టం. నేను నా ఆహారాన్ని నేనే తయారు చేసుకుంటాను. నా ఇంటిని నేను శుభ్రపరుస్తాను. నా కిరాణా షాపింగ్ నేనే చేస్తాను`` అని తెలిపారు. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి తన అంద‌మైన‌ రాత్రుల గురించి తాను ఎలాంటి దుస్తులు ధరించేదో కూడా మాట్లాడారు. టీవీలో అతను బాస్కెట్ బాల్ చూడటానికి ఇష్టపడతాడు.. నేను క్వీన్స్ గాంబిట్ చూడాలనుకుంటున్నాను అని ఆమె చెప్పింది.

బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాని పెళ్లాడాక సోన‌మ్ స్పీడ్ కాస్త నెమ్మ‌దించింద‌నే చెప్పాలి. 2007 లో సినీరంగంలో ప్ర‌వేశించిన సోన‌మ్ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా స్థిరపడ్డారు. కేన్స్ స‌హా ఎన్నో అవార్డ్ వేదిక‌ల‌పై సోన‌మ్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆనంద్ అహుజాతో సోన‌మ్ ప్రేమ కథ సినిమానే త‌ల‌పిస్తుంది. 2018 లో ఆనంద్ అహూజాని సోనమ్ పెళ్లాడారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పుడు ఆనంద్ ను ఆమె కలిసింది. అహూజాకి అస‌లు సోన‌మ్ తండ్రి గురించి తెలీద‌ట‌. కామ‌న్ ఫ్రెండ్ ద్వారా సోన‌మ్ ని క‌లిసాక ల‌వ్ లో ప‌డిపోయాడు పెళ్లాడేశాడు. ఈ జంట ఆద‌ర్శ జీవ‌నం ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తోంది.

సోనమ్ చివరిసారిగా 2019 లో విడుదలైన ది జోయా ఫాక్టర్ లో కనిపించింది. నెట్ ఫ్లిక్స్ చిత్రం ఎకె Vs ఎకెలో ఆమె తండ్రి అనిల్ కపూర్ - అనురాగ్ కశ్యప్ తో క‌లిసి నటించారు. 2011 దక్షిణ కొరియా థ్రిల్లర్ రీమేక్ అయిన బ్లైండ్ లో నూ సోన‌మ్ న‌టిస్తోంది.
Tags:    
  • sonam kapoor 
  • sonam kapoor Photoshoot 
  • sonam kapoor Photos 
  • sonam kapoor Clicks 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS