• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోల ఇళ్ల‌ను...

స్టార్ హీరోల ఇళ్ల‌ను చుట్టుముట్టిన జ‌నం.. ఏం జ‌రుగుతోంది?

By - Tupaki Desk
Update: 2022-05-04 05:40 GMT
ఆ ఇద్ద‌రు స్టార్ల ఇళ్ల‌ను అభిమానులు చుట్టుముట్టారు. ఊక‌వేస్తే రాల‌నంత మంది జ‌నం గేటు ముందే చాలా సేపు ప‌డిగాపులు ప‌డ్డారు. అసలేం జ‌రుగుతోంది..? అని ఆరా తీసేంత‌గా స‌న్నివేశం క‌నిపంచింది. ఇంత‌కీ ఎవ‌రా ఇద్ద‌రు స్టార్లు అంటే.. ఒక‌రు స‌ల్మాన్ ఖాన్.. ఇంకొక‌రు షారూక్ ఖాన్.

ద‌శాబ్ధాలుగా ఖాన్ లు బాలీవుడ్ ని ఏల్తున్నారు. ఏ ఇత‌ర స్టార్ల‌కు లేని ఫాలోయింగ్ ఖాన్ ల త్ర‌యానికి ఉంది. అస‌లు ఖాన్ ల‌కు ఈ రేంజు ఫాలోయింగ్ ఉందా? అనేంత‌గా నిన్న ఈద్ ని పుర‌స్క‌రించుకుని వారి ఇంటి ముందు ఊక వేస్తే రాల‌నంత మంది అభ‌మానులు విచ్చేసారు. స‌ల్మాన్ ఖాన్ - షారూక్ ఖాన్ ఇంటి ముంద‌రి స‌న్నివేశం ఔరా! అనిపించింది.

ప్రతి పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ వెలుపల బాంద్రాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ గుమిగూడి ఉంటారు. షారూఖ్‌ కనిపిస్తాడ‌ని క్రీగంటి  చూపుకోసం మన్నత్ వెలుపల చాలా మంది ప్రజలు వేచి ఉంటారు. ఈ సంవత్సరం కూడా అందుకు భిన్నంగా లేదు. ఈసారి కూడా షారూఖ్ ఖాన్ త‌న ఇంటి ముందు భారీగా గుమిగూడిన ప్రేక్షకులకు చేతులు ఊపుతూ వారికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

షారూఖ్ ఖాన్ మన్నత్ వెలుపల అభిమానులకు అభివాదం చేస్తూ...ఈద్ సందర్భంగా మీ అందరినీ కలవడం ఎంత మనోహరంగా ఉంది.. అంటూ సెల్ఫీని పంచుకున్నారు. తర్వాత జ‌నం గుమిగూడిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ షారూఖ్ ఖాన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఇలా అన్నారు. ''మీ అందరినీ ఈద్ సందర్భంగా కలవడం ఎంత ఆనందంగా ఉంది…. అల్లాహ్ మీ అంద‌రికీ ప్రేమ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

మీ గతంలోని ఉత్తమమైనది మీ భవిష్యత్తుకు చెడ్డది కాకూడ‌దు.. ఈద్ ముబారక్!!'' అనే క్యాప్షన్ తో పాటు రెండు ఫోటోలను షేర్ చేసారు. ఇందులో గుంపులో ఒకటి .. జనంతో ఉన్న వేరొక‌ సెల్ఫీని కూడా షేర్ చేశాడు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే .. షారూఖ్ ఖాన్ ఇటీవలే రాజ్ కుమార్ హిరానీతో కలిసి డంకీ పేరుతో తన వెంచర్ ను ప్రకటించారు. ఇది కాకుండా ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ వెంచర్ పఠాన్ లో న‌టిస్తున్నాడు. కొంత  గ్యాప్ లో అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ 3లో ప్రత్యేక పాత్రలో క‌నిపిస్తాడు.

ఇక ఈద్ పండ‌గ స‌ల్మాన్ భాయ్ ఇంట ఎలా జ‌రిగింది? అన్న‌ది చూస్తే అక్క‌డ కూడా సేమ్ సీన్ క‌నిపించింది. ఖాన్ ల ఇళ్లలో ఈద్ ఒక పెద్ద సందర్భం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ ఖాన్ లాగానే అతని స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా తన అభిమానులను పలకరించడానికి వారికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పడానికి బాల్కనీలోకి వచ్చారు. తన ఇంటి వెలుపల గుమిగూడిన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఈ స్పెష‌ల్ ఫోటోల‌తో క‌నిపించింది. ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని అతని గెలాక్సీ అపార్ట్ మెంట్ వెలుపల గుమిగూడిన వెర్రి అభిమానుల ఆనందం ఈ ఫోటోల్లో క‌నిపించింది. సల్మాన్ ఖాన్ వారి వైపు చేయి చూపడంతో పాటు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడంతో అభిమానులు సూపర్ స్టార్ ను క‌నులారా వీక్షించారు.

ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ అభిమానులు అతని నుంచి కొత్త విడుదలల‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈద్ సంద‌ర్భంగా సల్మాన్ ఖాన్ త‌న సినిమాల‌ విడుదలలను పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ సంవత్సరం ఆ అవ‌కాశం లేకుండా పోయింది. ఖాన్ ఇంకా చిత్రీకర‌ణ ద‌శ‌లోనే ఉన్నారు. అందువ‌ల్ల‌ ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు తన ఈద్ ని స్నేహితుడు దేవ‌గ‌న్ నటించిన‌ రన్‌వే 34 కోసం అంకిత‌మిచ్చాడు. ఇందులో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్- రకుల్ ప్రీత్ తదితరులు నటించిన సంగ‌తి తెలిసిందే.

స‌ల్మాన్‌ త‌దుప‌రి చిత్రాల విషయానికొస్తే.. కభీ ఈద్ కభీ దీపావళి లో అత‌డు కనిపిస్తాడు. ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌. ఆయుష్ శర్మ- సూరజ్ పంచోలి- హిమాన్షు ఖురానా త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు. సాజిద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది. అతను కత్రినా కైఫ్‌తో కలిసి టైగర్ 3లో కూడా నటిస్తున్నాడు.
Tags:    
  • StarHouses 
  • SalmanKhan 
  • ShahrukhKhan 
  • BollywoodActors 
  • EidFestival 
  • MicrobloggingSiteTwitter 
  • EidMubarak 
  • FansatKhansHouses 

Similar News

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

Copyright @2026

Powered by Blink CMS