• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాత 'పెళ్లి సందడి' ని...

పాత 'పెళ్లి సందడి' ని గుర్తు చేస్తాయా..?

By - Tupaki Desk
Update: 2021-04-26 07:30 GMT
ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు ఏప్రిల్‌ 28. ఎందుకంటే ఏప్రిల్‌ 28న ఆయన ద‌ర్శ‌కత్వం వ‌హించిన సూపర్ హిట్ సినిమా 'అడవి రాముడు' విడుదలైన రోజు. అదే ఏప్రిల్‌ 28న రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన 'బాహుబ‌లి 2' సినిమా విడుదలై ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి బాక్సాఫీస్ రికార్డుల‌ను తిరగరాసింది. ఇలాంటి ఒక ప్రాముఖ్య‌త ఉన్న ఏప్రిల్‌ 28న ఇప్పుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సార‌థ్యంలో రూపొందుతున్న ''పెళ్లి సంద‌D'' పాట‌ల సంద‌డి మొదలు కానుంది.

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'పెళ్లిసంద‌డి' సినిమా 1996లో విడుద‌లై అద్భుత‌ విజ‌యాన్ని సాధించ‌డ‌మేకాక పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌ గా నిలిచింది. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు మ‌ళ్లీ ''పెళ్లి సంద‌D'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది పెళ్లిసంద‌డికి సీక్వెల్ కాదు. ఓ సరికొత్త క‌థ‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. నాటి 'పెళ్లిసంద‌డి' లో హీరో శ్రీ‌కాంత్ అయితే నేటి 'పెళ్లిసంద‌D' లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా శ్రీ‌లీల నటిస్తోంది. కె.రాఘ‌వేంద్ర‌రావు - స్వ‌రవాణి కీర‌వాణి కాంబినేషన్ లో అప్ప‌టి 'పెళ్లిసంద‌డి' పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఇప్పుడు ఈ 'పెళ్లిసంద‌D' సినిమాకి కూడా కీర‌వాణి సంగీతం అందించ‌డం విశేషం.

ఇకపోతే రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న 'పెళ్లిసంద‌D' చిత్రంలోని ఓ పాట‌ను ఈ ఏప్రిల్‌ 28న విడుద‌ల‌ చేయడానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ పాట‌తో మ‌రోసారి రాఘ‌వేంద్ర‌రావు - కీర‌వాణిల పాట‌ల సంద‌డి మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. శివశక్తి దత్తా - చంద్రబోస్‌ లు ఈ సినిమాలోని పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. మరి ఈ పాటలు పాత 'పెళ్లి సందడి' ని గుర్తు చేస్తాయో లేదో చూడాలి. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సునీల్ కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా.. త‌మ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తున్నారు. కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో ఆర్‌.కె. ఫిలిం అసోసియేట్స్‌ మరియు ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి - శోభు యార్లగడ్డ - ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    
  • Pelli Sandadi 
  • Roshan 
  • Srikanth 
  • Tollywood 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS