• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రకంపనలు రేపుతున్న చిన్న...

ప్రకంపనలు రేపుతున్న చిన్న సినిమా

By - Tupaki Desk
Update: 2016-08-08 06:23 GMT
యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు రొటీన్ మాస్ మసాలా సినిమాల పట్ల ఆసక్తి చూపించరు. కొత్తదనం ఉండాలి.. ఎంటర్టైనర్లు అయి ఉండాలి.. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలి. ఈ లక్షణాలున్న సినిమాలైతే ఆ సినిమాకు దర్శకుడెవరు.. హీరో హీరోయిన్లు ఎవరు అన్నది కూడా పట్టించుకోరు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా బాగా ఆదరిస్తారు. ‘పెళ్లిచూపులు’ విషయంలోనూ అదే జరుగుతోంది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ చిన్న సినిమా అక్కడ రెండో వారంలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఈ చిత్రం ఈ శనివారం లక్ష డాలర్లకు పైగా  వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంటే ఒక్క రోజులో దాదాపు 70 లక్షల రూపాయలన్నమాట.

దాదాపుగా అందరూ కొత్తవాళ్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిన్న సినిమా రెండో వారాంతంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. విడుదలైన తొలి రోజు నుంచి అంచనాల్ని మించి వసూళ్లు సాధిస్తున్న ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే 6.3 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ వారం రిలీజైన రెండు సినిమాలూ యుఎస్ ఆడియన్స్ టేస్టుకు సరిపోయేవే అయినా.. వాటికి పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘పెళ్లిచూపులు’కే పట్టం కడుతున్నారు. ఉన్నంతలో మనమంతా కలెక్షన్లు బాగున్నాయి కానీ.. శ్రీరస్తు శుభమస్తు వసూళ్లు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి వసూలు చేస్తున్నదాని కంటే ‘పెళ్లిచూపులు’ ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. యుఎస్ హక్కుల కోసం ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే కనీసం 20 రెట్లు ఆదాయం రాబోతున్నట్లు అంచనా.
Tags:    
  • Pelli Choopulu Movie 
  • Telugu NEws 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS