• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దెబ్బకు ‘పెళ్లిచూపులు’...

ఆ దెబ్బకు ‘పెళ్లిచూపులు’ మందు రాస్తోంది

By - Tupaki Desk
Update: 2016-08-02 17:30 GMT
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ భారీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచినపుడు జనాలు ఒకరకమైన ఫ్రస్టేషన్లో ఉంటారు. అలాంటి టైంలో మంచి సినిమా పడితే దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ సినిమా అంచనాల్ని మించి విజయం సాధిస్తుంది. ఇందుకు ‘బిచ్చగాడు’ - ‘అఆ’ లాంటి సినిమాలే ఉదాహరణ. విడుదలైనపుడు అసలెవ్వరికీ పట్టని ‘బిచ్చగాడు’.. ‘బ్రహ్మోత్సవం’  పుణ్యమా అని ఉన్నట్లుండి జనాల్లోకి వెళ్లిపోయింది. ‘బ్రహ్మోత్సవం’ హ్యాంగోవర్‌ పోగొట్టుకోవడానికి జనాలు ‘బిచ్చగాడు’ చూశారు. ఆ తర్వాత ‘అఆ’ కూడా జనాలకు ఉపశమనాన్నిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించుకుంది.

లేటెస్టుగా జనాలు ‘కబాలి’ కొట్టిన దెబ్బకు విలవిలలాడిపోయి ఉన్నారు. విడుదలకు ముందు ఆ సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన స్టార్ల సినిమాలకు కూడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో హైప్ వచ్చింది ఈ సినిమాకు. కానీ ఆ హైప్ అంతా విడుదలయ్యాక ఉఫ్ అని ఎగిరిపోయింది. మాంచి ఎంటర్టైన్ అవుతుందనుకున్న ‘కబాలి’ తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆ సినిమా కొట్టిన దెబ్బకు ఇప్పుడు ‘పెళ్లిచూపులు’ మందు రాస్తోంది. ఈ సినిమా అంచనాల్ని మించి ఆడుతుండటానికి జనాల్లో ఉన్న ‘కబాలి’ ఫ్రస్టేషన్ కూడా ఓ కారణం. ఆ దెబ్బ నుంచి ‘పెళ్లిచూపులు’ ఉపశమనాన్ని ఇస్తోంది. తొలి వారాంతం అంతా అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం వల్ల భారీగా కలెక్షన్లు సాధించిన ‘కబాలి’ వీకెండ్ అవ్వగానే డల్లయిపోయింది. రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అదే సమయంలో ‘పెళ్లిచూపులు’ హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.
Tags:    
  • Pelli Choopulu Movie 
  • Telugu NEws 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS