బాహుబలి అనుభవం పెద్దాయనకు అద్భుతహ

Update: 2016-10-25 04:21 GMT
బాహుబలి2 కోసం ఓ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది రాజమౌళి అండ్ టీం. బాహుబలి సెట్స్ లో వర్చువల్ రియాలిటీని అనుభవించమని చెబుతోంది. అయితే ఇది కొంచెం కాస్ట్ లీ అయినా లేటెస్ట్ టెక్నాలజీ. ఆ అనుభవం పొందాలంటే ప్రతీ వాళ్లూ వీఆర్ హెడ్ సెట్స్ కొనుక్కొని.. దాన్ని స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని.. హై క్వాలిటీతో చూడాల్సి ఉంటుంది. కానీ ఈ సాంకేతికతకు లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ నుంచి ప్రశంసలు వచ్చాయి.

'ఇప్పుడు బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్ ను చూశా. మతి పోయింది. శ్రీనివాస మోహన్.. రాజమౌళి.. శోభులకు ఆల్ దిబెస్ట్' అంటూ పీసీ శ్రీరామ్ ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాటోగ్రఫీలో ఓ పుస్తకం స్థాయిలో ఎన్నో పేజీలు తన పేరిట రాసుకున్న పీసీ శ్రీరాం.. బాహుబలిలో ఉపయోగించిన ఫోటోగ్రఫీ టెక్నాలజీని ప్రశంసించడాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి.

పీసీ శ్రీరాం నోటి వెంట అనూహ్యంగా బాహుబలికి పొగడ్తలు రావడం.. కచ్చితంగా ఆ మూవీ టీమ్ కు ఉత్సాహం ఇచ్చే విషయమే. మరి ఫస్ట్ లుక్ తోనే వినూత్నమైన అనుభవాన్ని పంచిన బాహుబలి2.. రిలీజ్ నాటికి ఇంకెన్ని చూపిస్తాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News