పాయ‌ల్.. ఈ క్యూట్ ఫ్రెండు ఎవ‌రు?

Update: 2020-07-03 07:00 GMT
ఇటీవ‌ల‌ లాక్ డౌన్ పీరియ‌డ్ ని పాయ‌ల్ ఓ రేంజులోనే ఎంజాయ్ చేస్తోంద‌ట‌. సినిమా షూటింగుల‌కు గ‌త కొంత‌కాలంగా బ్రేక్ ప‌డ‌డంతో ఈ కాలాన్ని కుటుంబంతో స్పెండ్ చేసింది‌. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో ఫ్యామిలీ క్వారంటైన్ ఫోటోల‌ను షేర్ చేసింది. అప్ప‌ట్లోనే లాక్ డౌన్ టైమ్ లో నియ‌మ‌నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి ఆరుబ‌య‌ట షికార్లు చేసిన పాయల్ పై ట్రోలర్స్ విరుచుకుప‌డ్డారు.

అదంతా స‌రే కానీ ఈ మూడు నెల‌ల‌ ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ పాయ‌ల్ ఇంకేదైనా ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుందా అంటే అలాంటిదేమీ లేదు కానీ.. ఇదిగో ఇలా పెట్స్ తో టైమ్ పాస్ చేసింద‌ట‌. పాయ‌ల్ కి పెట్ డాగ్స్ అంటే అమిత‌మైన ప్రీతి. అందుకే ఇంట్లో ఓ రెండు బ్రాండెడ్ పెట్ డాగ్స్ ని పెంచుతోంది. అందులో ఒక ప‌ప్పీ ఎంత క్యూట్ గా పాయ‌ల్ తో ఫ్రెండ్షిప్ చేసిందో ఇదిగో ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది.

ఇటీవ‌ల టాలీవుడ్ లో స‌రైన ఆఫ‌ర్స్ లేవు. పాయ‌ల్ కి న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న ఛాన్స్ ద‌క్కింద‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌లోనే అలాంటి ఆఫ‌ర్ ఏదీ రాలేదు అని త‌నే స్వ‌యంగా క్లారిటీ ఇచ్చింది. అటు కోలీవుడ్ లో నూ ఇదే స‌న్నివేశం ఉందిప్పుడు. రవితేజతో డిస్కోరాజా.. ఆ త‌ర్వాత వెంకీ స‌ర‌స‌న వెంకీమామ‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. తమిళంలో `ఏజెంట్‌` అనే సినిమాలోనూ పాయ‌ల్ న‌టిస్తోంది. ఇంత‌కుమించి వేరే ఆఫ‌ర్లు ఏవీ లేవ్.
Tags:    

Similar News