ఘాటు అందాల తాకిడికి కుర్రాళ్లు కోలుకుంటారా?

Update: 2021-03-04 11:30 GMT
గంధం ఎప్పుడూ సువాసనలు వెదజల్లినట్టుగానే .. అందం ఎప్పుడూ ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. అందం ఎక్కడ ఉన్నా అది పడుచు కళ్లను అల్లుకుపోతూనే ఉంటుంది .. పదునైన మనసును పెనవేసుకు పోతూనే ఉంటుంది. నీరు పల్లమెరుగు అన్నట్టుగా, వయసొచ్చిన మనసులన్నీ అందాల వైపే పరుగులు తీస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అలిగే అమ్మాయిలే కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారు. ఎంత అందగా ఉంటారంటే .. ఇదిగో ఇక్కడ పాయల్ ఉన్నంత అందంగా.

పాయల్ ఓ పాలసముద్రం .. ఆమె కోల కళ్లలో కొంటె కెరటాలు ఎగసిపడుతూనే ఉంటాయి. అవి కుర్రాళ్ల ఊహలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి .. టైటిల్సూ - శుభం కార్డు లేకుండా వాళ్లు కనే కలలను తడిపేస్తూ ఉంటాయి. ఇక్కడ పాయల్ నవ్వులు చూస్తుంటే ముత్యాలవానలు కురిసినట్టు .. రత్నాల రాసులు పోసినట్టు లేదూ. ఆ నవ్వులు వెన్నెల్లో మల్లెల్లా రాలుతుంటే మడతమంచాలు వాల్చుకుని సేదదీరాలని ఏ కుర్రాడికి మాత్రం ఉండదు? బంగారానికి పసుపు బొట్టు పెట్టినట్టున్న ఆమె మేనిఛాయను చూస్తూ మెలకువగానే ఉండిపోవాలనీ, ఆమె ఎద అందాలను గురించి కథలుకథలుగా వినాలని ఎవరికి ఉండదు? అందగత్తెలు నిద్రపట్టినట్టుగా ఆరాధకులకు నిద్రపట్టదు గదా!

ఈ భారీ అందాల భామ చాలా తక్కువ కాలంలోనే కుర్ర మనసులను కూడగట్టేసింది. వాళ్లంతా ఆమె అభిమానులుగా మారిపోయి, హాటు లుక్కులను పంచుకుంటూ పరవశించిపోతున్నారు. బెల్లం చెరుకులాంటి ఈ పిల్లకి సరైన సినిమా పడాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఆమె అందాల ఘాటు నుంచి కోలుకోకుండా ఉండటంలోనే అసలైన ఆనందం ఉందని అనుకుంటున్నారు. అలాంటి సినిమా ఎప్పుడు పడుతుందో .. నీరసపడిన కుర్రాళ్లపై అది నిమ్మరసంలా ఎప్పుడు పనిచేస్తుందో చూడాలి మరి.    
Tags:    

Similar News