ఫోటో స్టోరి: రెబ‌ల్ యాటిట్యూడ్ తో రెచ్చ‌గొట్ట‌క‌లా

Update: 2021-03-23 17:30 GMT
తొలి సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి బంప‌ర్ హిట్ కొట్టాక కానీ అస‌లు పాయల్ ఎవ‌రో తెలియ‌లేదు. అంత‌కుముందు ఇంట‌రాక్ష‌న్స్ లోనూ టాలీవుడ్ మీడియా అంత‌గా ప‌ట్టించుకోలేదు. కానీ తొలి సినిమా రిలీజ్ త‌ర్వాత బోల్డ్ బ్యూటీ పాయ‌ల్ అద్భుతంగా న‌టించిందంటూ క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక‌ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తుంద‌ని పొగిడేశారు.

క‌ట్ చేస్తే పాయ‌ల్ రాంగ్ సెలెక్ష‌న్ త‌న కెరీర్ పై పెద్ద ప్ర‌భావం చూపించింది. ఒక‌టీ అరా డీగ్రేడ్ క్యారెక్ట‌ర్ల‌కు అంగీక‌రించి పెద్ద త‌ప్పు చేసింద‌ని విమర్శ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత వెంక‌టేష్ తో ఆఫ‌ర్ త‌ప్ప చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్లేవ్‌. కరెక్ష‌న్ కి రావాల‌న్నా కుద‌ర‌డం లేదు. ఆ క్ర‌మంలోనే వెబ్ సిరీస్ ల వైపు .. త‌మిళ ప‌రిశ్ర‌మ వైపు దృష్టి సారించాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం పాయ‌ల్ కి చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు లేవు. కానీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో వ‌ర‌స ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. పాయ‌ల్ రీసెంట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా మ‌రో స్పెష‌ల్ ఫోటోని పాయ‌ల్ షేర్ చేసింది. బ్లూ డెనిమ్ చినుగుల‌ నిక్క‌రు.. దానిపై బ్లాక్ స్వెట్ ష‌ర్ట్ తో రెబ‌లియ‌న్ ఫోజుతో రెచ్చ‌గొడుతోంది. తానేమైనా రెబ‌ల్ క్వీన్ అనుకుంటోందా? అంటూ ఫ్యాన్స్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. పాయ‌ల్ న‌టించిన యాంజెల్ (త‌మిళ్) రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఉద‌య‌నిది స్టాలిన్ స‌ర‌స‌న పాయ‌ల్ న‌టించింది.
Tags:    

Similar News