ఓర‌గా దోర‌గా చూడ‌క‌లా పాయ‌ల్!

Update: 2021-01-29 23:30 GMT
జీవితాన్ని ఎప్పుడూ సీరియ‌స్ గా తీసుకోకు.. తీసుకుంటే అందులోంచి బ‌య‌టికి రావు! అంటూ వేడెక్కించే కొటేష‌న్ ఇచ్చిన పాయ‌ల్ ఇంత‌కుముందు హాటెస్ట్ వీడియోల‌తో ఇన్ స్టాలో విరుచుకుప‌డింది. కైపెక్కించే ప‌రువాల‌ను వీడియోల్లో ఎలివేట్ చేసిన తీరు హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా మ‌రో హాటెస్ట్ లుక్ ని పాయ‌ల్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేయ‌గా అది కూడా అంతే వైర‌ల్ గా మారింది. వోర‌గా దోర‌గా చూస్తున్న పాయ‌ల్ స్ట‌న్నింగ్ బ్లాక్ డిజైన‌ర్ లుక్ లో మంట‌లు పెట్టింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

ఇటీవ‌ల కెరీర్ పరంగా పాయల్ ఏమంత జోరు చూపించ‌లేక‌పోతోంది.  ముఖ్యంగా టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో ఇరుగు పొరుగు భాష‌ల వైపు చూస్తోంది. తాజాగా ఆర్.ఎక్స్ 100 చిత్రంతో త‌న‌ని తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేసిన అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న‌ మహాసముద్రం లో పాయ‌ల్ ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో శర్వానంద్- సిద్ధార్థ్- అదితి రావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కథలో భాగంగా వచ్చే ప్రత్యేక గీతంలో పాయ‌ల్ కి ఆఫ‌ర్ ద‌క్కిందట‌.
Tags:    

Similar News