తొందరేమి లేదంటున్న వకీల్ సాబ్

Update: 2020-04-25 04:30 GMT
ఈ మహమ్మారి కరోనా లేకుండా ఉంటే ఈపాటికి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కళకళలాడుతూ ఉండేది. తెలుగు సినిమాలకు మంచి సీజన్‌ సమ్మర్‌ అనే విషయం తెల్సిందే. ఈ సమ్మర్‌ లో చిన్నా పెద్దా కలిసి కనీసం డజనుకు పైగా సినిమాలు వచ్చేవి. మార్చి చివరి వారం నుండే సినిమాల విడుదలకు ప్లాన్‌ చేశారు. కాని కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉండటంతో అన్ని సినిమాలు ఆగిపోయాయి. గత రెండు నెలలుగా బాక్సాఫీస్‌ జాడ లేకుండా పోయింది. లాక్‌ డౌన్‌ తర్వాత అయినా సినిమా హాల్స్‌ ఓపెన్‌ అవుతాయా అంటే అది కూడా లేదంటున్నారు.

మళ్లీ బొమ్మ పడాలంటే మూడు నెలలు.. అయిదు నెలలు.. ఎనిమిది నెలలు అంటూ ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలో పెద్ద సినిమాలు రావని దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. అంతా సవ్యంగా ఉంటే మే నెలలో రావాల్సి ఉన్న వకీల్‌ సాబ్‌ ను వచ్చే ఏడాదికి షిప్ట్‌ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా నెల రోజుల వర్క్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అయ్యి ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగేవి. కాని లాక్‌ డౌన్‌ తో షూటింగ్‌ కూడా పూర్తి చేయలేదు.

జూన్‌ లేదా జులై నుండి షూటింగ్స్‌ పున: ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ సినిమాను పూర్తి చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి అయినా కూడా తొందర పడకుండా తాపీగానే వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఆ తర్వాతే సినిమాను విడుదల చేయాలని పవన్‌ తో పాటు దిల్‌ రాజు కూడా భావిస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల అవ్వనుంది అంటున్నారు.

ఒక వేళ ఆ సినిమా వాయిదా పడితే ఖచ్చితంగా సంక్రాంతికి వకీల్‌ సాబ్‌ వస్తాడని అంటున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకున్న సమయంకే వచ్చినా కూడా రిపబ్లిక్‌ డే సందర్బంగా అయినా పీకే రీ ఎంట్రీ మూవీ వచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. మొత్తానికి వకీల్‌ సాబ్‌ హడావుడి లేకుండా మెల్లగానే వచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    

Similar News