పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని సెట్స్‌పై ఉండగా, మరికొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. వీటి మధ్యలో మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. అదే... 'వినోదయ సిత్తం' రీమేక్. తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో తన మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి నటిస్తున్నారు పవన్‌కల్యాణ్.
ఇప్పటికే ఈ చిత్రానికి కొబ్బరికాయా కూడా కొట్టారు. కానీ ఆ తర్వాతే ఏమి అప్డేట్స్ లేవు. ఇలా అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా.. కథలో మార్పులు, డేట్స్ సర్దుబాట్లు.. ఇలా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.
అయితే తాజాగా మరో వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే కథలో మార్పులు జరుగుతున్నాయని క్లారిటీ వచ్చింది. అయితే ఒరిజినల్ స్క్రిప్ట్ దెబ్బ తినకుండా మెయిన్ థీమ్ అలానే ఉండేలా చేస్తున్నారని తెలిసింది.
ఏదేమైనప్పటికీ ఈ చిన్న అప్డేట్ వచ్చేసరికి మళ్లీ సినిమాపై ఆడియెన్స్‌కు ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడు వస్తుందాని తెగ ఆరాటపడుతున్నారు. మాతృకని తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ రచన చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్ మనిషి రూపంలోని దేవుడిగా కనిపిస్తారని సమాచారం.
ఇకపోతే పవన్ చేస్తున్న సినిమాల్లో ఒకటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు'. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ గజదొంగగా కనిపించనున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ 'వినోదయ సిత్తం' రీమేక్‌లో నటిస్తారని తెలిసింది. మరోవైపు హరీశ్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ పట్టాలెక్కించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.