పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక రాజకీయాలతో సినిమా షూటింగ్స్‌కు డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొన్ని సెట్స్‌పైకి మరికొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అందులో సాహో డెరెక్టర్ సుజిత్ సినిమా కూడా ఒకటి ఉంది. అయితే ఈ చిత్రం గురించి ఫ్యాన్స్‌కు షాకింగ్ అండ్ సర్ప్రైజ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే పవన్ కల్యాణ్ అంటేనే ఎనర్జీ సాంగ్స్, డైలాగ్స్, ఫైట్స్.
వాటిని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుంటారు. కాలర్ ఎగరేసి తిరుగుతుంటారు. అలాంటిది సుజిత్ సినిమాలో పవన్‌కు ఫైటింగ్స్, సాంగ్స్ ఉండవట. వాటిని లేకుండానే కథను నడిపిస్తారట సుజిత్.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరా? ఎంజాయ్ చేయగలరా? అసలీ ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అవుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలా అయితే సినిమాను నడిపించడం కష్టమనే చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా గురించి విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్టైనర్స్ దీన్ని నిర్మిస్తోంది. పవన్‌కు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసి దీన్ని ప్రకటన చేశారు. 'ఫైర్ స్ట్రోమ్ ఇజ్ కమింగ్' అనే వ్యాఖ్యను జోడించారు.
పోస్టర్ పై THEY CALL HIM #OG అని కూడా రాశారు. పోస్టర్ ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్ మూవీ అని అర్థమవుతోంది. మరి ఇందులో పవన్‌కు ఫైట్స్ ఎందుకు లేవో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్టైనర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే పవన్ ఈ చిత్రంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు హరీశ్ శంకర్‌తో కలిసి భవదీయుడు భగత్‌సింగ్ తో అలరించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.