• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ పుత్ర భాయిజాన్.....

పవన్ పుత్ర భాయిజాన్.. టైటిల్లో విజ‌యేంద్రుని మార్క్?

By - Tupaki Desk
Update: 2022-01-12 05:37 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ రైట‌ర్ గా టాలీవుడ్ వెట‌ర‌న్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ రేంజ్ గురించి తెలిసిందే. బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న భ‌జ‌రంగి భాయిజాన్ లాంటి బంప‌ర్ హిట్ చిత్రానికి క‌థ -స్క్రిప్ట్ అందించారు. స‌ల్మాన్ - క‌బీర్ ఖాన్ జోడీతో క‌లిసి ఈ సినిమా కోసం విజ‌యేంద్రుడు ప‌ని చేశారు. భ‌జ‌రంగికి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప‌సివాడి ప్రాణం స్ఫూర్తి అన్న సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యాన్ని విజ‌యేంద్రుడే అధికారికంగా అంగీక‌రించారు.

ఇక‌పోతే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్టు రెడీ అవుతోంది. టైటిల్ ని కూడా నిర్ణ‌యించారు. స‌ల్మాన్ భాయ్.. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇరువురు స్వ‌యంగా టైటిల్ ని ప్ర‌క‌టించారు.  ప‌వ‌న్ పుత్ర భాయిజాన్ అనేది టైటిల్. ఈ టైటిల్ విన‌గానే అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప‌వ‌న్ పుత్ర అంటే ఆంజ‌నేయుడు.. అని అర్థం. టైటిల్ ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. ఇక `భజరంగీ భాయిజాన్` సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి అన్న సంగ‌తి తెలిసిందే. 2015 లో విడుద‌లైన ఈ మూవీలో స‌ల్మాన్ తో పాటు.. కరీనా కపూర్.. నవాజుద్దీన్ సిద్ధిఖి త‌దిత‌రులు నటించారు. సీక్వెల్ గురించిన క‌థ‌నాలు చాలా కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సీక్వెల్ పనులు జరుగుతున్నాయని విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నారని ఇటీవల సల్మాన్ స్వయంగా ధృవీకరించారు.

తాజా మీడియా స‌మావేశంలో విజయేంద్ర ప్రసాద్ త్వరలో స్క్రిప్ట్ పై పని చేస్తానని ధృవీకరించారు. కథాంశం కోసం లైన్ ని లాక్ చేసానని .. త్వరలో పూర్తి స్క్రిప్ట్ రాయడం ప్రారంభిస్తానని స్టార్ రైటర్ విజ‌యేంద్ర ప్రసాద్ వెల్ల‌డించారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేయ‌నున్నారని తెలిసింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ సీక్వెల్ 2023లో సెట్స్ పైకి వెళ్లవచ్చు. కబీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?  వేరొక ద‌ర్శ‌కుడిని ఎంపిక చేస్తారా? అన్న‌దానికి జ‌వాబు రావాల్సి ఉంది. ఇక ప‌వ‌న్ పుత్ర భాయిజాన్ టైటిల్ ఎంపిక ఎవ‌రిది? ఇది రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సూచించిన‌దేనా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం టైటిల్ పై క్యూరియాసిటీ నెల‌కొంది.

మ‌రోవైపు భాయ్ ఇత‌ర ప్రాజెక్టుల‌తో పూర్తి బిజీగా ఉన్నారు. సల్మాన్ టైగర్ 3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీ. దీనికి మనీష్ శర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షారూక్ ప‌ఠాన్ .. చిరంజీవి గాడ్ ఫాద‌ర్ చిత్రాల్లో స‌ల్మాన్ భాయ్ అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • salman khan 
  • salman khan movies 
  • salman khan bajrangi bhaijaan 
  • bajrangi bhaijaan sequel 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS