పవన్ - మహేష్ మల్లీస్టారర్ సాధ్యమేనా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ మహేష్ .. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన ప్రపంచంలో నంబర్ వన్ హోదాని అందుకున్న స్టార్లుగా ఆ ఇద్దరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఇద్దరికీ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. పవన్ ఇటీవల రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఓ సరికొత్త టాపిక్ తెరపైకొచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ తో కలిసి పవన్ మల్టీస్టారర్ లో నటించే వీలుందా? అన్నదే ఆ టాపిక్. అయితే అది ఇప్పట్లో పాజిబుల్ కాకపోయినా.. ఆ కాంబినేషన్ ని కలిపే మోస్ట్ పవర్ ఫుల్ స్క్రిప్టు సరైన దర్శకుడు దొరికితే మాత్రం కష్టమేమీ కాదన్నది అభిమానుల ఆలోచన. పవన్ ఇటీవల వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటవ్వగా మహేష్ ఒకదాని వెంట ఒకటిగా ఆచితూచి అడుగులేస్తున్నారు.
ఇకపోతే పవన్ బర్త్ డే సందర్భంగా మహేష్ ట్వీట్ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. పవన్ మంచి మనసును పొగిడేస్తూ బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్ తీరుపై పవన్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్ - మహేష్ మల్టీస్టారర్ కి ఆస్కారం ఉంటే బావుంటుందనే థింకింగ్ మొదలైంది. చాలా కాలం గ్యాప్ తర్వాత మహేష్ నుంచి విషెస్ అందింది. దానికి పవన్ స్పందించారా? అంటే.. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైమ్ లో పవన్ నుంచి మహేష్ ట్వీట్ కు రిప్లై రావడంతో ఒక్కసారిగా ఆ సస్పెన్స్ కు తెర పడింది. ఇటు సినీప్రముఖులు.. అటు రాజకీయ రంగ ప్రముఖులకు ఇది ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మల్టీస్టారర్ల ఒరవడిలో ఆ ఇద్దరూ కలిసి నటిస్తే బావుంటుందనేది అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుందనే భావిద్దాం.