డైరెక్టర్ కు పవన్ బర్త్ డే విషెష్
నేడు విలక్షణ దర్శకుడు క్రిష్ బర్త్ డే అనే విషయం తెల్సిందే. ఆయనకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు.. మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ తో క్రిష్ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత అయిన రత్నం ప్రత్యేకంగా క్రిష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్ కట్ చేయించారు. టీమ్ పవన్ 27 క్రిష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
ఇక త్వరలో క్రిష్ దర్శకత్వంలో తన 27వ సినిమా చేయబోతున్న పవన్ కళ్యాణ్ కూడా తనవంతు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రత్యక్షంగా క్రిష్ ను కలువలేక పోయిన ప్రత్యేకంగా క్రిష్ కోసం పూల బొకే పంపించాడు. దానిపై హ్యాపీ బర్త్ డే క్రిష్ గారు.. బెస్ట్ విషెష్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అంటూ ఉంది. వీరిద్దరి కాంబో కోసం చాలా రోజులుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఖచ్చితంగా సినిమా ప్రత్యేకంగా ఉంటుందని.. హిట్ అయినా కాకున్న ఎప్పటికి అభిమానులు గుర్తుంచుకునే విధంగా సినిమా ఉంటుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్మకంగా ఉన్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ డ్రామాతో ఈ సినిమాను క్రిష్ రూపొందించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లగా కూడా సమాచారం అందుతోంది.