సైరాలో పవర్ చూపించనున్న పవన్?

Update: 2017-11-23 05:36 GMT
మెగాస్టార్ నటిస్తున్న సై రా నరసింహారెడ్డి మూవీ పనులు ఇప్పుడు మొదలైపోయాయి. తొలి షెడ్యూల్ షూటింగ్ కంటే ముందే.. టెస్ట్ షూట్ కూడా పూర్తి చేసుకుని అందరూ సంతృప్తి చెందారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. ఈ సినిమాలో దేశవ్యాప్తంగా పలు భాషలకు చెందిన గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటులు నటించనున్నారు.

సైరా చిత్రంలో ఓ కీలక పాత్ర ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మూవీలో 10 నిమిషాలు మాత్రమే ఈ పాత్ర ఉంటుందట. కానీ ఆ కేరక్టర్ ఉన్నంతసేపు.. మొత్తం కథను లీడ్ తీసేసుకునే రోల్ అంటున్నారు. అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ ఫుల్ రోల్ ను వెంకటేష్ తో చేయించాలని తొలుత భావించారు సైరా యూనిట్. కానీ ఆశ్చర్యకరంగా.. ఈ పాత్రను తాను పోషిస్తానని చెప్పాడట చిరు సోదరుడు పవన్ కళ్యాణ్. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. ఆ పాత్రకు ఎంతగా వెయిటేజ్ పెరిగిపోతుందో చెప్పాల్సిన పనిలేదు.

పైగా మెగాస్టార్ తో కలిసి పవర్ స్టార్ కనిపించడం అంటే.. మెగా అభిమానులకు వేరే పండుగ ఏదీ ఉండదు. ఇప్పటికే సైరా మూవీలో ఒక పాత్ర కోసం నాగేంద్ర బాబును ఖాయం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కనిపించనున్నాడనే వార్తలతో.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో కనిపించనున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ తేజ్.. సినిమాలో కాకపోయినా.. ఏదో ఒక చోట కచ్చితంగా కనిపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Tags:    

Similar News