పవన్ ధైర్యం చేయట్లేదా? చేయడా?

Update: 2017-03-28 10:19 GMT
అప్పుడే ఒక సినిమాను తీసి లైమ లైట్లోకి వచ్చిన బాబీ అనే దర్శకుడితో సర్దార్. అసలు ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ లేని డైరక్టర్ డాలీతో కాటమరాయుడు. ఇప్పుడేమో త్రివిక్రమ్ తో ఒక సినిమాను స్టార్ట్ చేస్తున్నప్పటికీ ఆ తరువాత మాత్రం మళ్ళీ ఎవరైనా సంతోష్‌ శ్రీనివాస్.. నీసన్ వంటి ఫేం తక్కువగానే ఉన్న డైరక్టర్లతో పనిచేయాలని పవన్ అనుకుంటున్నాడు. ఎప్పుడో గబ్బర్ సింగ్ అనే సినిమా వర్కవుట్ అయితే అయ్యుండొచ్చు కాని.. అస్తమానం ఈ చిన్న దర్శకులు హిట్లు ఇవ్వాలంటే కూడా కష్టమే. అసలు స్టార్ డైరక్టర్లతో పవన్ ఎందుకు పనిచేయడు? ధైర్యం చేయట్లేదా? ధైర్యం చేయడా?

నిజానికి పవన్ కళ్యాణ్‌ ఎవరైనా స్టార్ డైరక్టర్ తో పనిచేస్తే.. అతగాడికి ఒక 7-10 కోట్లు రెమ్యూనరేషన్ ఉంటుంది. కాని వారి ద్వారా హిట్టు కూడా గ్యారంటీగా పడే ఛాన్సుంటుంది. బోయపాటి శ్రీను వంటి దర్శకుడి చేతిలో కాటమరాయుడు పెట్టుంటే.. దాని రేంజ్ ఇంకోలా ఉండేది. హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఈ దర్శకుడు నిష్ణాతుడు. పోనివ్ వివి వినాయక్ కు ఇచ్చుంటే.. మాస్ ఎలిమెంట్స్ ఒక రేంజులో పండేవి. కాని పవన్ మాత్రం ఏరికోరి చిన్న చిన్న డైరక్టర్లనే తీసుకుంటున్నాడు. ఏమన్నా అంటే కాస్టాఫ్‌ మేకింగ్ తగ్గించాలని.. చిన్న దర్శకుడితో తీస్తే ఒక 10 కోట్ల వరకు సేవింగ్ చేయొచ్చని పవన్ ఫీలింగ్ అంటారు ఆయన సన్నిహితులు.

కాని ఏం లాభం? పవన్ ఎంత చిన్న డైరక్టర్ ను పెట్టుకుని ఎంత తక్కువ బడ్జెట్లో సినిమాను తీసినా కూడా.. దానిని చివరకు 90 కోట్ల రేంజులోనే అమ్ముతున్నారు. అంత పెద్ద రేట్లకు అమ్ముతున్నప్పుడు.. పెద్ద డైరక్టర్ తో పనిచేస్తే.. కాస్త సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది కదా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News