ప్చ్.. కాటమరాయుడు టీజర్ రావట్లేదు!!

Update: 2017-01-23 06:50 GMT
అదేంటో తెలియదు కాని.. ఇప్పటికే చాలాసార్లు వెనక్కి తగ్గిన ''కాటమరాయుడు'' టీజర్ ఇప్పుడు మరోసారి వెనకడుగు వేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ను.. సంక్రాంతికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఆ డేట్ మిస్సయిపోయింది. అయితే జనవరి 26న టీజర్ వస్తోందని ఇప్పటికే భారీ ప్రచారం జరిగిపోయింది. కాని అది కూడా తూచ్ అంటున్నారు నిర్మాతలు.

''జనవరి 26న కాటమరాయుడు టీజర్ రావట్లేదు. కొత్త డేట్ త్వర్లోనే ప్రకటిస్తాం'' అంటూ నిర్మాత శరత్ మరార్ క్లారిటీ ఇచ్చేశాడు. అసలు జనవరి 26న వచ్చే టీజర్ గురించి మూడు రోజుల ముందే ఎందుకు క్లారిటీ ఇచ్చేసినట్లు? ఈ టీజర్ రాకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ టీజర్ కోసం అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ పవన్ కు నచ్చలేదా? లేదంటా పవన్ ఈ టీజర్ డబ్బింగ్ వర్క్ ను ఇంకా పూర్తి చేయలేదా? ఆయన అనుకున్నట్లు టీజర్ రాలేదా? అబ్బే అదేం కాదు.

జనవరి 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీచ్ సిటీ అయిన వైజాగ్ లో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం మౌన పోరాటం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం ప్రశాంతంగా కొనసాగిస్తానంటే.. దీనికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. ఆ రోజు పోరాట కార్యక్రమంలో పవన్ బిజీగా ఉంటాడు.. అలాగే విద్యార్ధులు కూడా బిజీగా ఉంటారు కాబట్టి.. ఇక టీజర్ రిలీజ్ చేస్తే నైతికంగా బాగోదనిపించి.. క్యాన్సిల్ చేశారట. వెల్ డన్ కాటమరాయుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News