డ్రైవింగ్‌ లైసెన్స్‌ పవన్‌ వద్దకు చేరిందా?

Update: 2020-05-13 05:15 GMT
ఈమద్య కాలంలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాల గురించిన వార్తలు జోరుగా వస్తున్నాయి. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత మూడు సినిమాలకు కమిట్‌ అయ్యి ఇప్పటికే అందులో పింక్‌ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ ను దాదాపుగా పూర్తి చేసిన పవన్‌ లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే క్రిష్‌ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమాకు డేట్లు ఇవ్వబోతున్నాడు. ఆ సినిమాలు ఇంకా మొదలు కాకుండానే పవన్‌ తదుపరి చిత్రాలకు ఓకే చెబుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇటీవల గోపాల గోపాల.. కాటమరాయుడు చిత్రాల దర్శకుడు డాలీ దర్శకత్వంలో ఒక తమిళ రీమేక్‌ ను చేసేందుకు పవన్‌ ఓకే చెప్పాడంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదని డాలీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఈయన రీమేక్‌ చేయబోతున్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం. గత కొన్నాళ్లుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన రీమేక్‌ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమా రీమేక్‌ లో ఆ హీరో నటించబోతున్నాడు.. ఈ హీరో నటించబోతున్నాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు పవన్‌ వద్దకు ఈ రీమేక్‌ వచ్చినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది ఒక మల్టీస్టారర్‌ చిత్రం. ఒక హీరో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కు వెళ్లగా అతడి అభిమాని అయిన ఆర్‌ టి ఐ ఆఫీసర్‌ వ్యవహరించే తీరు దాంతో హీరో విసుగు చెందడం దాంతో అభిమాని ఈగో హర్ట్‌ అవ్వడం వంటి అంశాలతో కథ సాగుతుంది.

హీరో పాత్రలో మలయాళ స్టార్‌ పృధ్వీరాజ్‌ పోషించాడు. పవన్‌ రీమేక్‌ చేస్తే అదే పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక వేళ ఇది నిజమే అయితే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేసే 28వ చిత్రం తర్వాత పవన్‌ తన 29వ చిత్రంగా ఈ రీమేక్‌ ను చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News