పవన్ సమ్మర్ టూర్ వెళ్తున్నాడోచ్

Update: 2016-05-04 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ కనిపించనంత స్పీడ్ గా ఉన్నాడిపుడు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని ముందుగా చెప్పిన డేట్ ఏప్రిల్ 8కి విడుదల చేయడం కోసం.. జనవరి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేశారు. అ తర్వాత కూడా కొన్నాళ్లు ప్రమోషనల్ యాక్టివిటీస్ పాల్గొన్న పవన్.. ఆ వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేసేశాడు. రీసెంట్ గా కొత్త సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ కాగా.. మరో నెల రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ లోగా ఓ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఫ్యామిలీతో సహా వెకేషన్ కి వెళ్తున్నాడని, రెండు వారాల పాటు ఈ హడావిడికి దూరంగా గడపబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. పవన్ అబ్రాడ్ టూర్ వెళతాడా, ఇండియాలోనే ఏదైనా హిల్ స్టేషన్ కి వెళ్లనున్నాడా అనే విషయం మాత్రం తెలీలేదు. సాధారణంగా ఇలాంటి సంగతులు బైటకు చెప్పే అలవాటు కానీ, ఆ ఏరియాల నుంచి సెల్ఫీలు దిగి ఆన్ లైన్ లో పెట్టే అలవాటు కానీ పవన్ కి లేదు. సో.. పవన్ ఎక్కడికి వెకేషన్ వెళ్తున్నాడనే మాట సస్పెన్సే.

అయితే.. వెకేషన్ నుంచి తిరిగి రాగానే.. ఎస్ జే సూర్య దర్శకత్వంలో చేయనున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్స్ లో పాలు పంచుకుంటాడట పవన్ కళ్యాణ్. జూన్ రెండో వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది.
Tags:    

Similar News