రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'.. టీజర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల 'నా సామి రంగా' సినిమాలో నటించిన విషయం తెలిసిందే

Update: 2024-05-05 14:31 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల 'నా సామి రంగా' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి జె శివ సాయి వర్ధన్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ మారుతి తన టీమ్ తో కలిసి సమర్పిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపించారు. చూడడానికి సాఫ్ట్‌ వేర్‌ ఎంప్లాయ్ లాగా ఉన్నా.. బ్యాక్‌ గ్రౌండ్‌ లో మాత్రం అమ్మాయిల బ్యూటీ ప్రొడక్ట్స్, చీరలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ ఏదో కొత్తగా, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. వాటిని నిజం చేస్తూ మేకర్స్ నేడు టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇప్పుడెంతో ట్రెండింగ్ లో ఉన్న శారీ డ్రాపింగ్ ను వృత్తిగా ఎంచుకున్న రాధగా రాజ్ తరుణ్ ను పరిచయం చేయడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో హీరో అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. బైక్ పై అబ్బాయిలా కూర్చోవడానికి కూడా ఇష్టపడడు. ఇక హీరోయిన్ (మనీషా కందుకూరు) అతడిని ప్రేమిస్తూ ఉంటుంది. హీరోను టెంప్ట్ చేయాలని కూడా చూస్తుంది. చివరకు వారి ప్రేమకథ ఏం అయిందనేది మిగతా సినిమాగా తెలుస్తోంది.

మొత్తానికి టీజర్ అంతా ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. డైరెక్టర్ శివ సాయి వర్ధన్ ఒక వినూత్నమైన అంశాన్ని తీసుకుని.. రాజ్ తరుణ్ ను హిలేరియస్ క్యారెక్టర్ లో చూపించారు. ఇలాంటి కాన్సెప్ట్ ను రాజ్ తరుణ్ ఎంచుకోవడం గ్రేట్ అని చెప్పాలి. ఆయన కామిక్ టైమింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది. హీరోయిన్ మనీషా కందుకూరు కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అనేక మంది కమెడియన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

Read more!

ఈ మూవీలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'చెప్పవే చిరుగాలి' ఫేమ్ అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ వంటి పలువురు నటీమణులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హైపర్ ఆది, గోపరాజు రమణ, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక టీజర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News