ఫ్యానిజం: కరెంట్ షాక్ మృతులకు పవన్ భరోసా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ ఆయన మంచి మనసును కొనియాడుతూ సూపర్ స్టార్ మహేష్ విషెస్ తెలిపారు. దానికి పవన్ రిప్లయ్ ఇచ్చారు. ఆ ఇద్దరూ కలిసి ఏదైనా మల్టీస్టారర్ లో నటిస్తే ఇంకా బావుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అదంతా సరే కానీ.. చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ కల్యాణ్ కోసం ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురయ్యి ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఊహించని ఆ దుర్వార్తకు వెంటనే పవన్ తరపున రామ్ చరణ్.. బన్ని.. అలాగే పలువురు సినీనిర్మాతలు స్పందించి బాధిత కుటుంబాలకు తమవంతు సాయం చేస్తామని ప్రకటించారు. అప్పట్లో వారికి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
మరోసారి చరణ్.. బన్ని సహా బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చిన పెద్దలందరికీ పవన్ కృతజ్ఞతలు తెలపడం చర్చనీయాంశమైంది. ఆ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ లో అభిమానులకు టచ్ లోకొచ్చారు పవన్. ``కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని.. చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి.. అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి.. నిర్మాతలు శ్రీ దిల్ రాజు.. శ్రీ ఏ.ఎమ్ రత్నం.. మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు`` అంటూ ట్వీట్ చేసారు.