మళ్లీ బన్నీపై విరుచుకు పడుతున్న పవన్‌ ఫ్యాన్స్‌!

Update: 2020-04-09 06:30 GMT
గతంలో పలు సార్లు అల్లు అర్జున్‌ పై పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా చెప్పను బ్రదర్‌ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ ఫ్యాన్స్‌ ఆ సమయంలో ఎంతటి రాద్దాంతం చేశారో తెలిసిందే. ఎన్నికల సమయంలో పవన్‌ వద్దకు బన్నీ వెళ్లడం మద్దతు తెలవడంతో అప్పటి నుండి పవన్‌ ఫ్యాన్స్‌ బన్నీని టార్గెట్‌ చేయడం మానేశారు. తాజాగా మరోసారి బన్నీని కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు.

నిన్న పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా పుట్టిన రోజు అనే విషయం తెల్సిందే. అకీరా పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి.. నాగబాబు.. రామ్‌ చరణ్‌.. సాయి ధరమ్‌ తేజ్‌.. వరుణ్‌ తేజ్‌ లు ట్విట్టర్‌ లో విషెష్‌ చెప్పారు. ఇక ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున అకీరా పుట్టిన రోజు హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేశారు. పలువురు ప్రముఖులు కూడా అకీరాకు విషెష్‌ చెప్పగా బన్నీ మాత్రం అకీరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదంటూ పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు మండిపడుతున్నారు.

నిన్న పుట్టిన రోజు జరుపుకున్న అఖిల్‌ అక్కినేనికి బన్నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. కాని అకీరారకు చెప్పక పోవడం ఏంటీ అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. అఖిల్‌ కు విషెష్‌ చెప్పకుంటే అకీరా విషయంలో కూడా బన్నీని అనేవాళ్లం కాదు. కాని అఖిల్‌ కు చెప్పి అకీరాకు చెప్పక పోవడం తమకు కోపంను కలిగిస్తుందని.. మరోసారి పవన్‌ అంటే అగౌరవంను బన్నీ ప్రదర్శించాడంటూ పవన్‌ ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విషయంలో బన్నీకి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ చిన్న విషయాన్ని కూడా రాద్దాంతం చేయనక్కర్లేదంటున్నారు.


Tags:    

Similar News