స‌క్సెసైతే ఏడుపెందుకు? ఇదేం దురభిమానం?!

Update: 2020-01-15 06:13 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ మ‌ధ్య వైరం ఉంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. చెప్ప‌ను బ్ర‌ద‌ర్! అన్న ద‌గ్గ‌రి నుంచి బ‌న్నీని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. బ‌య‌ట‌కు క‌లిసి ఉన్న‌ట్లు క‌నిపించినా..లోలోన ఒక‌రంటే ఒకరికి స‌రిప‌డ‌ద‌ని ఒక సెక్ష‌న్ మీడియా సాగించిన ప్ర‌చారం తో ఇరువురి అభిమానుల మ‌ధ్య పెద్ద యుద్దానికే కార‌ణ‌మైంది.  సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ద‌ర్భాష‌లాడుకోవ‌డం తెలిసిందే. ప‌వ‌న్ సినిమాల‌ను బ‌న్నీ ఫ్యాన్స్ విమ‌ర్శించ‌డం....బ‌న్నీ సినిమాల‌ను ప‌వ‌న్ అభిమానులు విమ‌ర్శించ‌డం కొత్తేం కాదు.  అయితే ఇటీవ‌ల కాలంలో ఆ వైరం కాస్త త‌గ్గిన‌ట్లు ఆసక్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అందుకు  ప‌వ‌న్ తాజా విషెస్ లేఖ పెద్ద సాక్ష్యంగా నిలిచింది. అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో బ‌న్నీ కి ప‌వ‌న్ నిన్న‌టి రోజున పుష్ఫం గుచ్చం పంపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో బ‌న్నీ అభిమానులు సంతోష‌డ్డారు. అది గ‌డిచి 24 గంట‌లైనా గ‌డ‌వ‌క ముందే ప‌వ‌న్ అభిమానులు బ‌న్నీ సినిమాపై ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అల వైకుంఠ‌పుర‌ములో బ‌న్నీకి బ‌దులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించి ఉంటే బాగుండేద‌ని....ప‌వ‌న్ ఇమేజ్ కు అయితే ఈ  క‌థ ఇంకా బాగుండేద‌ని ఓ సెక్ష‌న్ సోష‌ల్ మీడియా వ‌ర్గాలు నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నారు.

ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ క‌థ‌లు ప‌వ‌న్ కు ఎందుకు ఇవ్వ‌రు గురూజీ అంటూ త్రివిక్ర‌మ్ ని ఆడిపోసుకోవ‌డం మొద‌లైంది. నిజంగా ప‌వ‌న్ న‌టించి ఉంటే టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేసేవాడ‌ని వ్యాఖ్య‌ల్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్ర‌చారం ఎంత చేసినా ఓరిగేదేమీ లేదు. సినిమా ఎలాగూ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. వ‌సూళ్ల  ప‌రంగా బ‌న్నీ క్రేజ్ వ‌ల్ల‌ దుమ్ముదులిపేస్తోంది. కాబ‌ట్టి ఇలాంటి పోలిక‌లు ..ప్ర‌చారాలు ఎన్ని  చేసినా లాభం లేద‌ని బ‌న్నీ అభిమానులు కౌంట‌ర్లు వేస్తున్నారు. అటు పింక్ రీమేక్ విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు ప‌వ‌న్ పై  ఇప్ప‌టికే అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. ఆయ‌న స్థాయికి స‌రితూగే క‌థాంశం కాదని.. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేవ‌ని విమ‌ర్శించారు. మ‌రి వీట‌న్నింటిపైనా ప‌వ‌ర్ స్టార్ స్పందిస్తారేమో చూడాలి.


Tags:    

Similar News