పవన్‌ ఫోటోలో ఉంది వాళ్ళేనా అసలు??

Update: 2016-02-24 11:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ డైనింగ్‌ విత్‌ రేణు దేశాయ్‌ అంటూ.. స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ నెట్వర్క్‌ పేజీ వారు ఒక ఇమేజ్‌ ను షేర్‌ చేశారు నిన్ననే. సర్దార్ గబ్బర్‌ సింగ్‌ షూటింగ్‌ లో ఉంటూ కూడా.. తన మాజీ వైఫ్‌ తో కలసి పవన్‌ ఇలా పిల్లల కోసం టైమ్‌ కేటాయించాడంట.. అసలు సూపరబ్బా అంటూ అందరూ నోరెళ్ళబెట్టేస్తున్నారు. అయితే ఈ మిస్టరీ ఫోటో చూడగానే ఎవరికైనా తట్టే మొదటి రెండు ప్రశ్నలు ఏంటంటే..

అసలు ఆ ఫోటోలో బ్యాక్‌ నుండి కనిపిస్తోంది రేణు దేశాయ్‌ కాదని ఇట్టే అర్ధమవుతోంది కదా.. మరి రేణుతో డైనింగ్‌ ఏంటి? పైగా పవన్‌ పెద్ద కూతురు ఆద్య.. మరీ ఆ ఫోటోలో కనిపించినంత చిన్న పిల్ల కానే కాదు. కొందరు చెబుతున్నదాని ప్రకారం చూస్తే.. అక్కడ పవన్‌ తన ఫారిన్‌ భార్య అన్నా లెజినోవాతో కలసి డిన్నర్‌ చేస్తున్నారట. పైగా ఫోటో కనిపిస్తున్న ఆ పాపాయ కూడా.. వీరి కూతురు అని తెలుస్తోంది.

మొదటి భార్య రేణు దేశాయ్‌ తో పవన్‌ కు అకీరా, ఆద్య లు జన్మించగా.. రెండో భార్య అన్నా లెజినోవాతో ఒక కూతురు ఉంది. ఇకపోతే ఒకవేళ నిజంగానే ఈ డిన్నర్‌ మీటింగ్‌ జరిగుంటే.. తండ్రితో కలసి భోజనం చేస్తున్నపిల్లలు అంటూ ఈపాటికే రేణు ట్వీటేసేదే. అందుకే ఈ ఫోటో వెనుక చాలా మిష్టరీ దాగుందనే చెప్పాలి.
Tags:    

Similar News