రౌడీగారి పాట పాడుతున్న పీకేగారి కూతురు!

Update: 2019-03-20 06:01 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూ జనసేన అధ్యక్షుడిగా రాజకీయాలలో బిజీగా ఉన్నారు కానీ ఒక హీరోగా ఆయన క్రేజ్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదు.  పవన్ కు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకునేందుకు అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.  ముఖ్యంగా పవన్ పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి.  తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది.

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య రీసెంట్ గా ఒక తెలుగు పాట పాడింది.  ఒక అబ్బాయి పియానోపై ఆ పాటను ప్లే చేస్తూ ఉంటే ఆద్య తన గొంతు సవరించుకోవడం విశేషం.  ఇంతకీ ఆ పాట ఏమనుకున్నారు? టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్ 'మాటే వినదుగ వినదుగ'.  పీకే డాటర్ ఇలా రౌడీగారి పాట ను ముద్దుముద్దుగా పాడడం నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది.  ఆద్య వాయిస్ కొంచెం తక్కువ వాల్యూమ్ లో వినిపిస్తోంది కాబట్టి మీరు మీ డివైస్ లో కొంచెం వాల్యూం పెంచుకొని వినాలి. అంతే.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే.. పియానో దగ్గ కూర్చుని వినే సమయంలో ఆద్య తన చేతిని గడ్డం దగ్గర పెట్టుకోవడం చూస్తుంటే అచ్చం పవర్ స్టార్ మ్యానరిజం లాగే ఉంది.  అంతే కాదు.. క్లోజ్ అప్ లో సైడ్ యాంగిల్ లో పవన్ ను చూసినట్టే ఉంది.  పవన్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది ముచ్చటగా అనిపించడం ఖాయం.  మీరు ఒక లుక్కేయండి. 


Full View
 
Tags:    

Similar News