పిక్ టాక్ : భీమ్లా నాయక్ ఊరమాస్ లుక్
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ సినిమా గురించిన అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు మరియు పోస్టర్స్ వీడియోలు వచ్చిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి సినిమా నుండి ఒక పోస్టర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ లుక్ ను గతంలోనే విడుదల చేసినా కూడా తాజాగా విడుదల అయిన ఈ పొటో కు నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున ఈ ఫొటోను అభిమానులు షేర్ చేస్తున్నారు.
పవన్ అలా లుంగీ పైకి ఎగ్గట్టుతూ వస్తుంటే అభిమానుల కళ్లు రెండు కూడా చూడ్డానికి చాలడం లేదు అనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ గా త్వరగా చూడాలనే ఆసక్తి కోరిక ఈ ఫొటో మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. విడుదల వాయిదా పడ్డా కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన భీమ్లా నాయక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ రచన సహకారం అందించాడు. ఈ సినిమా లో రానా కూడా కీలక పాత్రలో నటించడంతో సినిమా మల్టీ స్టారర్ గా టర్న్ అయ్యింది.
నిత్యా మీనన్ ను ఈ సినిమా లో పవన్ కు జోడీగా నటింపజేశారు. ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గా కనిపించబోతుండగా.. నిత్యా మీనన్ మాత్రం మాజీ నక్సల్ గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఒక బిడ్డకు తల్లిగా కూడా కనిపించబోతుందట.
మొత్తానికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాస్ తో పాటు అన్ని వర్గాల అభిమానులను కూడా అలరించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతికి వచ్చి ఉంటే ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ ను దక్కించుకునేది అనేది టాక్. కాని మంచి సీజన్ ను పవన్ వదులుకున్నాడు. అన్ని సినిమాలకు కూడా మంచి జరగాలనే ఉద్దేశ్యంతో పవన్ ఈ నిర్ణయంను తీసుకున్న విషయం తెల్సిందే.