• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్‌క్లూజివ్‌: పవన్‌...

ఎక్స్‌క్లూజివ్‌: పవన్‌ గెడ్డం పెంచింది అందుకే

By - Tupaki Desk
Update: 2015-05-25 11:30 GMT
పవన్‌ గుబురుగెడ్డం వెనక చిక్కుముడి వీడింది. పొడవాటి గిరజాలు, గడ్డం పెంచడానికి అసలు కారణం తెలిసింది. నిన్నటివరకూ పవన్‌ 'కల్కి' అవతారం ఎత్తుతున్నారు. అందుకే ఇలా రూపం మార్చారు అంటూ ప్రచారం సాగింది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో దాసరి నిర్మించే కల్కి సినిమా కోసమే పవన్‌ ఇలా చేశాడంటూ ప్రచారమైంది. అలాగే ఓ స్మామీజీ దీక్ష చేయమని చెప్పడంతో ఇలా 42 రోజులపాటు దీక్ష చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఏమాత్రం నిజంలేదని తెలుస్తోంది.

అసలు ఇలా గడ్డం పెంచడానికి, జుత్తు పెంచడానికి కారణం వేరే. ఈనెల 29 నుంచి పూణేలో గబ్బర్‌సింగ్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. వాటి కోసమే ఈ రూపం మార్పు. గుబురుగడ్డం, మీసం, పొడవాటి గిరజాలతో కనిపించే సన్నివేశాలు తెరకెక్కించడానికకి రంగం సిద్ధమవుతోంది. అందుకోసం పూణేలోని ఓ గ్రామం సమీపంలో విలేజీ సెట్‌ వేశారు. ఆ సన్నివేశాల కోసమే పవన్‌ ఇలా పెంచుకుని తిరుగుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌ దృష్టి కేవలం గబ్బర్‌సింగ్‌ 2 పైనే. వేరే ఏ ఇతర కమిట్‌మెంట్ల గురించి అతడు ఆలోచించడంలేదు. అలాంటప్పుడు ఇక మురుగదాస్‌తో కల్కి సినిమా అన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని తేలిపోయింది.


Tags:    
  • Pawan Kalyan 
  • New Look 
  • telugu NEws 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS