ఫైట్ చేయనున్న సాఫ్టువేర్ ఇంజనీర్ పవన్

Update: 2017-03-27 07:21 GMT
'తీన్ మార్' సినిమాలో అమెరికా ఎపిసోడ్ ఉంది చూశారు.. అందులో సూటు బూటు వేసుకుని ఒక ఫైనాన్స్ ఎనలిస్ట్ క్రింద పవన్ కళ్యాణ్‌ చివర్లో లుక్ వైజ్ అదరగొట్టేశాడు. ఇప్పుడు అదే లుక్కులో ఒక సినిమా అంతా మెరవబోతున్నాడు. అవును.. త్రివిక్రమ్ డైరక్షన్లో పవన్ చేస్తున్న కొత్త సినిమాలో మనోడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాడట. ఈ సినిమాలో పూర్తి కార్పొరేట్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇంతకీ మనోడు సాఫ్టువేర్ వేషం ఎప్పటినుండి వేసుకుంటున్నాడు మరి?

ప్రజాకోర్టు లో కాటమరాయుడుపై తీర్పుతో సంబంధం లేకుండా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తన తదుపరి సినిమాను మొదలెట్టేస్తున్నాడు. ఏప్రియల్ మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. ఇప్పటికే ఆర్ట్ డైరక్టర్ ఈ సినిమాకోసం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ వేయగా.. దానిలో పవన్ కళ్యాణ్‌ కొన్ని మార్పులు చెప్పాడట. ఆ సెట్లో మార్పులు చేయడానికి టైమ్ పడుతుంది కాబట్టి.. ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేద్దాం అన్నాడట త్రివిక్రమ్. అందుకే విజయన్ మాష్టార్ కంపోజింగ్ లో ఇప్పుడు పవన్ ఫైట్ సీక్వెన్సులు చేయనున్నాడు.

మొత్తానికి దసరా బరిలో పవన్ అండ్ త్రివిక్రమ్ సినిమా కూడా రేసులో ఉంటుందేమో అనే సందేహం వస్తోంది కదూ. చూద్దాం ఈ సినిమానైనా స్పీడుగా పూర్తి చేస్తాడో లేకపోతే క్వాలిటీతో పూర్తి చేస్తాడో!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News