రోజుకు 12 గంటలు కష్టపడుతున్న పవన్

Update: 2017-04-11 06:29 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజుకు 12 గంటలు విరామం లేకుండా శ్రమిస్తున్నాడట. ఈ కష్టమంతా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తన రాజకీయ పార్టీ జనసేన కోసం కాదట... వచ్చే ఆగస్టు 15 కి సిద్ధమవుతున్న కొత్త సినిమా కోసమట. ఎన్నికల నాటికి సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఫ్రీ అయిపోవాలన్న ప్రయత్నమో ఏమో కానీ పవన్ మాత్ర వాచీ ముల్లులా పనిచేస్తున్నాడని పిలిం నగర్ లో టాక్.
    
త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా కోసం పవన్ పై కొన్ని సన్నివేశాలతో పాటు తేలికైన కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.  షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది.  కేవలం ఈ షెడ్యూల్ కు మాత్రమే కాదు, టోటల్ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే రోజుకు 12 గంటలు కష్టపడాలని డిసైడ్ అయ్యాడట. కాగా ఈ  సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీకెండ్ తో పాటు పంద్రాగస్ట్ వేడుక కూడా కలిసొస్తుంది కాబట్టి కలెక్షన్లకు తిరుగుండదన్నది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది.
    
అందుకే సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో జులై మొదటి వారానికి పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంకా మూడు నెలల టైం మాత్రమే ఉండడంతో పవన్ గట్టిగా కష్టపడక తప్పని పరిస్థితి.  అయితే, పవన్ కష్ఠానికి బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే ఈ సినిమాకు ఎక్కువ ఆఫర్ చేశారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News