ఇన్నాళ్లకు పవన్‌ మళ్లీ తన 'ఆ ట్యాలెంట్‌'ను చూపబోతున్నాడట!

Update: 2021-04-18 11:30 GMT
పవన్‌ కళ్యాణ్ కెరీర్‌ ఆరంభంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం సంపాదించిన విషయం తెల్సిందే. పవన్‌ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో మార్షల్‌ ఆర్ట్స్ ను ప్రదర్శించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో పవన్ కళ్యాణ్‌ తన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రతిభను కనబర్చుతూ వచ్చాడు. కాని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన ఎలాంటి యాక్షన్‌ సన్నివేశాలను చేసింది లేదు.

మళ్లీ ఇన్నాళ్లకు పవన్‌ కళ్యాణ్ తన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రతిభను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వకీల్ సాబ్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమా అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ తో ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ తో పాటు పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. దొంగగా.. వారియర్‌ గా పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ను బట్టి అర్థం అయిపోతుంది. ఈ పాత్ర కోసం పవన్‌ కళ్యాణ్ మార్షల్‌ ఆర్ట్స్‌ తో పాటు యుద్ద విద్యలను ప్రదర్శించబోతున్నాడు. కత్తి.. బల్లెం.. భాణం ఇలా అన్ని రకాల ఆయుదాలతో కూడా పవన్‌ పోరాటం చేయాల్సి ఉంటుందట. దానికి తోడు మార్షల్‌ ఆర్ట్స్‌ తో పవన్ తన శత్రువుల ఆట కట్టిస్తాడని కూడా అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ లో ఎప్పుడో ట్రైనింగ్‌ అయ్యాడు. అయినా కూడా ఇప్పుడు ఆయన మళ్లీ తన సినిమాలో చూపించేందుందుకు చేసే విషయంలో అస్సలు ఇబ్బంది పడటం లేదట. ఆయన మళ్లీ మార్షల్ ఆర్ట్స్ తో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఈతరం హీరోలకు ఆదర్శంగా నిలువబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమా లో యాక్షన్‌ సన్నివేశాలకు దర్శకత్వం వహిస్తున్న స్టంట్స్‌ కొరియోగ్రాఫర్‌ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ గారిని హరి హర వీరమల్లులో చాలా ఎనర్జితో మరియు చాలా ఉత్సాహంగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ త్వరలోనే మళ్లీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News