మళ్లీ గబ్బర్‌ సింగ్‌ కావాలంటున్న ఫ్యాన్స్‌

Update: 2020-04-17 11:10 GMT
పవన్‌ కెరీర్‌ పరంగా కష్టాల్లో ఉన్న సమయంలో గబ్బర్‌ సింగ్‌ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత పవన్‌ స్టార్‌ డం మరింతగా పెరిగింది. మళ్లీ ఆ స్థాయి మాస్‌ మసాలా ఎంటర్‌ టైనర్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తూనే ఉన్నారు. పవన్‌ 28వ సినిమాకు గబ్బర్‌ సింగ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. దాంతో ఫ్యాన్స్‌ మళ్లీ మాకు గబ్బర్‌ సింగ్‌ మూవీనే కావాలంటున్నారు. పవన్‌ ను మళ్లీ మేము అలాగే చూడాలనుకుంటున్నాం అంటూ హరీష్‌ శంకర్‌ కు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెడుతున్నారు.

ప్రస్తుతం పవన్‌ వకీల్‌ సాబ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న విరూపాక్ష చిత్రాన్ని పవన్‌ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. అది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ పూర్తిగా పవన్‌ స్క్రిప్ట్‌ పనిలోనే బిజీగా ఉన్నాడు.

పవన్‌ ను అమితంగా అభిమానించే హరీష్‌ శంకర్‌ ఫ్యాన్స్‌ ఎలా అయితే పవన్‌ ను చూడాలనుకుంటున్నారో అలాగే చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. స్క్రిప్ట్‌ విషయంలో ఏమాత్రం ఛాన్స్‌ తీసుకోకుండా మాస్‌ మసాలా ఎలిమెంట్స్‌ తో సినిమాను తెరకెక్కించేందుకు హరీష్‌ శంకర్‌ రెడీ అవుతున్నాడు. మరి పవన్‌ ఫ్యాన్స్‌ మాస్‌ మసాలా ఆకలిని దర్శకుడు హరీష్‌ శంకర్‌ తీర్చుతాడా చూడాలి.


Tags:    

Similar News