నారా దర్శకుడితో మెగా హీరో మూవీ

Update: 2017-11-23 09:31 GMT
రస్తుతం టాలీవుడ్ లో కొత్త దర్శకులు బాగానే జోరు చూపిస్తున్నారు. అరంగేట్రం చేస్తున్న సినిమాతోనే ట్యాలెంట్ చూపించి తర్వాత మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతున్నారు. వీరిలో నిలకడగా రాణించేవారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. న్యూ డైరెక్టర్ల సంఖ్య బాగానే పెరుగుతోంది.

తొలి సినిమా విడుదలయ్యాక.. అది సక్సెస్ సాధిస్తే మరిన్ని ఆఫర్స్ అందుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఓ దర్శకుడికి తొలి చిత్రం రిలీజ్ కాకుండానే.. కొత్త సినిమా ఆఫర్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నారా రోహిత్ తో బాలకృష్ణుడు మూవీ తెరకెక్కించిన దర్శకుడు పవన్ మల్లెల.. అప్పుడే రెండో సినిమా ఆఫర్ కూడా పట్టేశాడు. అది కూడా మెగా హీరోతో కావడం విశేషం. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో పవన్ మల్లెల నెక్ట్స్ ప్రాజెక్టు చేయనున్నాడు.

ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తికాగా.. వచ్చే ఏడాది సమ్మర్ లో షూటింగ్ ప్రారంభించాలని కూడా ఫిక్స్ అయిపోయారట. సాయి ధరం తేజ్- పవన్ మల్లెల కాంబినేషన్ లో తెరకెక్కే మూవీని కూడా బాలకృష్ణుడు నిర్మాతలే రూపొందించనున్నారు. మహేంద్ర బాబు.. వంశీ.. శ్రీ వినోద్ లు నిర్మాతలుగానే పవన్ మల్లెల కొత్త చిత్రం ప్రారంభం కానుంది.
Tags:    

Similar News