• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లుక్కు తెచ్చిన లక్కు...

లుక్కు తెచ్చిన లక్కు ఇంతింత కాదయా!!

By - Tupaki Desk
Update: 2017-04-02 14:27 GMT
ఒకప్పుడు జగపతి బాబు అంటే ఫ్యామిలీ హీరో. జగపతి సినిమాలంటే.. లేడీస్ గంటల పాటు క్యూల్లో నుంచుని మరీ టికెట్లు కొనుక్కుని మరీ చూసేవారు. ఆ తర్వాత జేబీ సినిమాల్లో క్వాలిటీ తగ్గింది.. అందుకు తగ్గట్లుగానే చూసే ఆడియన్స్ కౌంట్ తగ్గింది. కొన్నేళ్లు గడిచేసరికి అసలు సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్లిపోయిందో కూడా తెలీని పరిస్థితి.

'ఓ సినిమాలో జూబ్లీ హిల్స్ రోడ్డుపై నుంచుని బొమ్మలు అమ్మతుంటాను.. ఇలా ఫ్లాపులు కంటిన్యూ అయితే.. ఫ్యూచర్ లో నా పరిస్థితి ఇదేనా అనుకున్నాను' అని జగపతి బాబు స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు. కానీ నందమూరి హీరోలు జగపతి స్థాయి మార్చేశారు. లెజెండ్ లో బాలకృష్ణకు విలన్ గా అరంగేట్రం చేసి క్రూరత్వాన్ని.. నాన్నకు ప్రేమతో చిత్రంలో స్టైలిష్ విలన్ గాను మెప్పించేయడంతో.. జేబీపై ఇప్పుడు యూత్ లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.

అందుకే వారాహి లాంటి సంస్థ జగపతి బాబును లీడ్ రోల్ లో పెట్టి ఓ సినిమా చేసేస్తోంది. షూటింగ్ ప్రారంభం రోజునే రిలీజ్ చేసిన టీజర్ కు.. రెండు రోజుల్లోనే 12 లక్షల వ్యూస్ వచ్చాయంటే.. ఈ పటేల్ సార్ కు రెస్పాన్స్ అర్ధమవుతుంది. మొన్ననే షూటింగ్ మొదలైన జగపతి బాబు మూవీకి.. అప్పుడే ట్రేడ్ ఎంక్వైరీలు కూడా స్టార్ట్ అయ్యాయంటేనే.. జగపతికి విలన్ లుక్కు తీసుకొచ్చిన లక్ ఎంతగా మారిందో.. ఈయన రేంజ్ ఎలా ఛేంజ్ అయిందో చెప్పచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagapathi Babu 
  • Patel S.I.R Movie 
  • Patel S.I.R Movie Teaser 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS