పవన్‌ ఎమ్మెల్యే అయినా నటిస్తూనే ఉండాలి

Update: 2020-02-05 04:44 GMT
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు దూరం అయిన పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీ అయ్యాడు. కోట్లు ఇచ్చే సినిమాను వదిలి పెట్టి పవన్‌ రాజకీయాల్లో చేయడం కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తే మరి కొందరు పవన్‌ ఏమైనా పిచ్చివాడా అంటూ కామెంట్స్‌ చేశాడు. హీరోగా అంతటి క్రేజ్‌ ఉన్న పవన్‌ రాజకీయాలు చేస్తూ కూడా సినిమాలు చేయాలని అభిమానులు కోరారు. కాని కొన్ని సందర్బాల్లో పవన్‌ మళ్లీ సినిమాలు చేయలేనేమో అంటూ కామెంట్స్‌ చేశాడు.

కారణాలు ఏమైనా మళ్లీ ఇప్పుడు పవన్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మూడు సినిమాలను లైన్‌ లో పెట్టిన పవన్‌ ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నాడు. ఇదే సమయంలో పవన్‌ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన లక్ష్మినారాయణ పార్టీని వీడటం అందుకు కారణం పవన్‌ మళ్లీ సినిమాలు చేయడం అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన పవన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ పార్టీకి రాజీనామా చేస్తే వందల మంది వేల మంది పవన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీ వారు పవన్‌ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. రాజకీయాలు చేసే వారు సినిమా చేయకూడదని ఏమీ లేదు అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత కూడా నటించిన విషయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా పరుచూరి పలుకులు కార్యక్రమం లో పరుచూరి గోపాల కృష్ణ ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న పవన్‌ రీ ఎంట్రీ గురించి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా పవన్‌ నిర్ణయాన్ని అభినందించాడు.

ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గ్యాప్‌ వచ్చిన రోజు సినిమాలు చేయండి అంటూ సలహా ఇచ్చాడు. తాను గతంలోనే పవన్‌ కు ఒక సలహా ఇచ్చాను. మీరు ప్రజల్లోకి వెళ్లి ఒక విషయాన్ని చెప్పే కంటే మీడియా ద్వారా లేదంటే సినిమా ద్వారా ఆ విషయాన్ని చెప్పడం వల్ల ఎక్కువగా రీచ్‌ అవుతుంది.

గతంలో విజయశాంతి కర్తవ్యం సినిమా చూసి లేడీస్‌ పోలీస్‌ అవ్వాలనుకున్నారు. సినిమాకు అంతటి పవర్‌ ఉంటుంది. ఎన్టీఆర్‌ ఓడిపోయిన సమయంలో మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా చేశారు. మళ్లీ ఎన్టీఆర్‌ సీఎం అవ్వడం లో ఆ సినిమా ఏ స్థాయిలో ఆయన కు ఉపయోగ పడిందో మాకు తెలుసు. అందుకే పవన్ ఎం‌ఎల్‌ఏ అయినా కూడా నటించాలనేది తన అభిప్రాయం అన్నారు.

రచయితలు మరియు నటులు సృష్టి కి ప్రతి సృష్టి చేయగల సత్తా ఉన్న గొప్ప కళాకారులు. అలాంటి కళాకారులు సమాజం లోని పరిస్థితులను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపించగలరు. అందుకే పవన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంను తాను స్వాగతిస్తున్నట్లుగా పరుచూరి బ్రదర్‌ కామెంట్‌ చేశారు.
Tags:    

Similar News