• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైనా నెహ్వాల్ బ‌యోపిక్.....

సైనా నెహ్వాల్ బ‌యోపిక్.. శ్ర‌ద్ధ ఔట్‌!

By - Tupaki Desk
Update: 2019-03-15 08:47 GMT
బ్యాడ్మింట‌న్ స్టార్ - తెలుగ‌మ్మాయి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. శ్ర‌ద్ధా క‌పూర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. ఆమోల్ గుప్తా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా కోస‌మే శ్ర‌ద్ధా ఏడాది కాలంగా బ్యాడ్మింట‌న్ ప్రాక్టీస్ చేస్తోంది. పుల్లెల గోపిచంద్, సైనా ల‌ వ‌ద్ద హైద‌రాబాద్ లో కొంత‌కాలం పాటు ట్రైనింగ్ తీసుకుంది. అయితే ఏడాది కాలంగా ఈ బ‌యోపిక్ గురించి వార్త‌లు వ‌స్తున్నా.. చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన స‌రైన స‌మాచారం లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్ర‌ద్ధా క‌పూర్ ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తొల‌గించార‌ని తెలుస్తోంది. శ్ర‌ద్ధా ఆ పాత్ర‌కు యాప్ట్ కాలేదు. ఇన్నాళ్లుగా శిక్ష‌ణ తీసుకుంటున్నా సైనా పాత్ర‌తో స‌రైన సింక్ కుద‌ర‌లేదు. పైగా త‌న‌కు ఉన్న ఇత‌ర షెడ్యూల్స్ వ‌ల్ల ఇప్ప‌టికే ప‌లుమార్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని ఇబ్బంది పెట్టింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి త‌న‌ని త‌ప్పించి ప‌రిణీతి చోప్రాని నాయిక‌గా ఎంపిక చేసుకున్నార‌ని  తెలుస్తోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ మీడియా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించడం సంచ‌ల‌న‌మైంది. అయితే ఏడాది పాటు శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాత కూడా శ్ర‌ద్దాతో నిర్మాత‌ల‌కు ఎందుకు కుద‌ర‌లేదు? అంత‌గా ఆ పాత్ర‌లో ఇన్వాల్వ్ కాలేక‌పోతోందా?  ఇత‌ర సినిమాల హ‌డావుడిలో దృష్టి సారించ‌లేక‌పోయిందా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది.

వాస్త‌వానికి 2017 ఏప్రిల్ నుంచి శ్ర‌ద్ధా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ప్రారంభ‌మే శ్ర‌ద్ధా నుంచి స‌రైన కోఆప‌రేష‌న్ లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దానిపై అప్ప‌ట్లోనే బాలీవుడ్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. బ్యాడ్మింట‌న్ ట్రైనింగ్ షెడ్యూల్స్ ప్ర‌కారం శ్ర‌ద్ధ‌ కోఆప‌రేట్ చేయ‌లేక‌పోయింద‌ట‌. ఇదే విష‌యంపై `స్త్రీ` ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల్లోనూ మీడియా నుంచి శ్ర‌ద్ధా ప్ర‌శ్న‌లు ఎదుర్కొంది. కానీ స‌రైన స‌మాధానం రాలేదు. తాజా అప్ డేట్ ప్ర‌కారం.. శ్ర‌ద్ధా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం  శ్ర‌ద్ధా లాస్ .. ప‌రిణీతి గెయిన్! అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత డిలే త‌ర్వాత ప‌రిణీతి జాయిన్ అయ్యింది కాబ‌ట్టి ఈ ప్రాజెక్టు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టేనా? ప‌రిణీతికి శిక్ష‌ణ‌నిచ్చి అప్పుడే చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంటుందా? అన్న‌ది వేచి చూడాలి.


Tags:    
  • Parineeti Chopra 
  • Shraddha Kapoor 
  • Saina Nehwal Biopic 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS