బ‌హుభాష‌ల్లో పాన్ ఇండియా ఓటీటీ సినిమా ప్లాన్

Update: 2020-08-15 04:00 GMT
అమెజాన్ .. నెట్ ఫ్లిక్స్ స‌హా ప‌లు ఓటీటీ కార్పొరెట్ దిగ్గ‌జాలు మ‌నుగ‌డ సాగిస్తున్న చోట `ఆహా-తెలుగు` ఓటీటీని ప్రారంభించి వార్ లోకి దిగారు బాస్ అల్లు అర‌వింద్. సినిమా టీవీ వ్యాపార రంగాల్లో ఆయ‌న స‌క్సెస్ చూసి `ఆహా`ను అంతే పెద్ద రేంజుకు తీసుకెళతార‌నే భావిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న వంద‌ల కోట్లు వెద‌జ‌ల్లే ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తుండ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌లువురు ద‌ర్శ‌కర‌చ‌యిత‌లు .. ప్ర‌తిభావంతుల‌కు ఆహా వేదిక‌పై అర‌వింద్ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు.

ఇటీవ‌ల ఆయ‌న ప్లానింగ్ చూస్తుంటే ఓటీటీ వేదిక‌ను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఓటీటీ కోసం ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ తో మంత‌నాలు సాగించామ‌ని అర‌వింద్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఇది పాన్ ఇండియా రేంజు మూవీ అని ఆయ‌న తెలిపారు.

తెలుగు స‌హా ప‌లు భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ‌య్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన‌ పేర్లు చెప్ప‌లేను కానీ.. ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తాం!! అంటూ బాస్ అర‌వింద్ ప్ర‌క‌టించ‌డంతో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఇది ఆహా కోస‌మేనా లేక ఇంకేదైనా కార్పొరెట్ ఓటీటీ కోస‌మా? అన్న‌ది మాత్రం అర‌వింద్ వెల్ల‌డించ‌లేదు. అక్టోబ‌ర్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆహాలో ప్ర‌స్తుతం జోహార్.. మెట్రో క‌థ‌లు స్ట్రీమింగ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే థియేట‌ర్ వ్య‌వ‌స్థ ర‌న్ అవుతుండ‌గానే నిరాటంకంగా ఓటీటీ హ‌వా సాగిస్తుంద‌న్న అభిప్రాయాన్ని అర‌వింద్ వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News