'ధురంధర్ 2' కాపీ స్టోరీ..? డైరెక్టర్ ఆన్ ఫైర్!
ఈ మధ్య వైరల్‌గా మారిన వాటిని క్యాష్ చేసుకోవాలని చాలా మంది చీప్ క్రిట్స్ ప్లే చేస్తుంటారు.;
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్ ది రివేంజ్`. ఆదిత్యధర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందు నుంచే పెయిడ్ ప్రీమియర్స్‌తో రికార్డుల వేట మొదలు పెట్టంది. వసూళ్ల పరంగా సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్న `ధురంధర్ 2` ఇప్పటికే పలు రికార్డుల్ని తుడిచిపెట్టి సరికొత్త చరిత్ర దిశగా పయనిస్తోంది. అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాల రికార్డుల్ని అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు `ధురంధర్ 2` ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1525 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలతో పాటు సినీ వర్గాలని విస్మయానికి గురి చేస్తోంది. సినిమా సాధిస్తున్న విజయంపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు సినిమాని అభినందిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే ఈ మూవీ తన స్క్రిప్ట్ నుంచి కాపీ చేసి రూపొందించారని ఓ వ్యక్తి మీడియాకు ఎక్కడం సంచలనంగా మారింది.
ఈ మధ్య వైరల్‌గా మారిన వాటిని క్యాష్ చేసుకోవాలని చాలా మంది చీప్ క్రిట్స్ ప్లే చేస్తుంటారు. ఇదే తరహాలో బాలీవుడ్‌కు చెందిన ఫిల్మ్‌మేకర్ సంతోష్‌కుమార్ `ధురంధర్ ది రివేంజ్`ని నేను చేసుకున్న స్టోరీ నుంచి లేపేసి తీశారని ఆరోపించడమే కాకుండా మీడియా ముఖంగా దర్శకుడు ఆదిత్యధర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023లో తాను రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్ నుంచి కాపీ చేశారని, నా ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ని వారు తారుమారు చేసి వాడుకున్నారు. నా దగ్గర స్క్రిన్ రైటర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి` అంటూ `ధురంధర్ 2`పై సంచలన ఆరోపణలు చేశాడు.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు ఆదిత్యధర్ ఫైర్ అయ్యాడు. సంతోష్ కుమార్‌పై లీగల్ యాక్షన్‌కు దిగాడు. ఇందులో భాగంగా సంతోష్ కుమార్‌కు లీగల్ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా ఎక్కువైందని, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయకూడదని తన లీగల్ టీమ్‌తో సతీష్ కుమార్‌కు నోటీసులు జారీ చేయించాడు. అంతే కాకుండా అతను చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లీగల్ టీమ్‌తో ఆదిత్యధర్ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పాక్‌లోని ల్యారి నేపథ్యంలో ఈ మూవీని నిర్మించడంతో ల్యారీకి సంబంధించిన వారు మా ప్రాంతం పేరుని వాడుకున్నారు కాబట్టి `ధురంధర్ 2` లాభాల్లో మాకు కనీసం రూ.500 కోట్లు అయినా చెల్లించాలని విచిత్ర వాదన వినిపించడం తెలిసిందే. ఇప్పడు ఏకంగా ఓ వ్యక్తి తన స్టోరీని కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేయడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు లీగల్‌గా ఎదుర్కోవడానికి సిద్ధం కావడం గమనార్హం.