మారుతి వదిలిన బాణం.. ఈసారైనా హిట్ దక్కేనా?
ఈమధ్య 'పలాస 1978' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. పలాస హీరో రక్షిత్ ఎవరో కాదు ఎపీ.. తెలంగాణాలో పాపులర్ స్వీట్ షాప్ చెయిన్ అయిన స్వీట్ మ్యాజిక్ గ్రూప్ కు ఎండీ. రక్షిత్ కు ఇది మొదటి సినిమా కాదు. మారుతి నిర్మాణంలో.. దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన 'లండన్ బాబులు' (2017) సినిమా ద్వారా ఈ రక్షిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచింది.
ఆ సినిమా తో బ్రేక్ రాకపోవడంతో ఇప్పుడు మారుతి రూటు కాకుండా మరో రూటు ఎంచుకున్నాడు. ఈసారి 'పలాస 1978' కోసం పూర్తిగా రగ్డ్ అవతారంలోకి మారిపోయాడు. ట్రైలర్ డిఫరెంట్ గానే ఉంది కానీ రిలీజ్ టైమింగ్ మాత్రం పెద్దగా అనుకూలంగా లేదు. మంచి డేట్ దొరకక పోవడంతో ఈ సినిమాను మార్చి 6 న విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి నెలే కాదు మార్చ్ కూడా టాలీవుడ్ సినిమాలకు అన్ సీజన్. అదొక్కటే కాదు మార్చి మొదటి వారం అంటే సరిగ్గా పరీక్షల సమయం. ఇది డెడ్ సీజన్ అనుకోవాలి. మరి ఇలాంటి సీజన్లో సినిమాను విడుదల చేయడం పెద్ద రిస్క్.
మరి ఇలాంటి డెడ్ సీజన్ లో సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కత్తిమీద సామే. కంటెంట్ బాగున్న సినిమాలకు కూడా ఇలాంటి సందర్భాలలో దెబ్బ పడుతుంది. మరి 'పలాస 1978' టీమ్ ఈ ఇబ్బందులను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.