• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతి మార్క్ 'పక్కా...

మారుతి మార్క్ 'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్..!

By - Tupaki Desk
Update: 2022-06-08 11:00 GMT
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ కోర్టు డ్రామాలో గార్జియస్ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు.

ఇప్పటికే 'పక్కా కమర్షియల్' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ - 'అందాల రాశీ' పాట అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది.

ఇందులో భాగంగా తాజాగా 'పక్కా కమర్షియల్' ట్రైలర్  గ్లింప్స్ ను సోషల్ మీడియాలో వదిలారు. మారుతి మార్క్ ప్రమోషనల్ స్ట్రాటజీతో కట్ చేయబడిన ఈ వీడియో అలరిస్తోంది. 'మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు.. పనయ్యాక వాణ్ణి వంగబెట్టి..' అని కమెడియన్ శ్రీనివాసరెడ్డి చెప్తుండగా.. వీడియో బఫర్ అవుతున్నట్లు చూపించారు.

అయితే అది బఫర్ అవడం లేదు.. కావాలనే ఆపేసాం అని చెప్పి నవ్వించారు మారుతి. ముహూర్తం టైం చూసి జూన్ 12న ఫుల్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో 'పక్కా కమర్షియలేయ్' అంటూ అల్లు అరవింద్ మాటలను కూడా జత చేయడం విశేషం.

ఈ సినిమాలో పక్కా కమర్షియల్ లాయర్ గా గోపీచంద్ కనిపించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ హీరో మునుపటి చిత్రాల కంటే చాలా స్టైలిష్ గా కనిపించారు. సత్యరాజ్ - ప్రవీణ్ - జబర్దస్త్ వేణు - చమ్మక్ చంద్ర - రఘు తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ గ్లింప్స్ రాబోయే ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.

జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. SKN సహ నిర్మాతగా వ్యవహరించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ చేశారు. ఆర్ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.


Full View
Tags:    
  • Tollywood 
  • PakkaCommercial 
  • movie 
  • TrailerGlimpse 
  • Gopichand 
  • RaashiKhanna 
  • Maruthi 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS